పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న టాలీవుడ్ డైరెక్టర్..ఇందులో వాస్తవమెంతా..?
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎపీ రాజకీయాల్లో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీలన్ని ఎలక్షన్‌ల మూడ్‌లోకి వెళ్లబోతున్నాయి. ఇప్పటికే కొందరు రాజకీయ నాయకులు పార్టీలకు రాజీనామా చేసి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. అయితే, ఈ క్రమంలో టాలీవుడ్ డైరెక్టర్ ఎపీలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా, ఆ డైరెక్టర్ ఎపీ పర్యటనతో నెట్టింట్లో ఊహగానాలు ఊపందుకున్నాయి.
టాలీవుడ్ డైరెక్టర్ వీవీ వినాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆది, చెన్నకేశవరెడ్డి, బన్నీ, ఠాగూర్, లక్ష్మీ వంటి సూపర్ డూపర్ సినిమాలను అందించాడు. తెలుగు సీనీ చరిత్రలో ఆయన, ఆయన సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం ఈయన గురించి సోషల్‌మీడియాలో ఓ వార్త తెగ ప్రచారమవుతుందో. వీవీ వినాయక్ ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వీవీ వినాయక్ సొంతూరు తాడిపూడి అనే సంగతి అందరికీ తెలిసిందే.

ఆయన సొంతూరుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సర్పంచి నామా శ్రీనివాసు, జడ్పీ వైస్ ఛైర్మన్ శ్రీలేఖ, వైఎస్సార్‌సీపీ నేతలంతా ఘన స్వాగతం పలికారు. తాడిపూడి పక్కనే ఉన్న ఏలూరు జిల్లాలోని మహాలక్ష్మిపేటలో జరిగే గొంతెలమ్మ పండగకు వీవీ వినాయక్ విచ్చేశారు. అయితే, ఆయన వచ్చే ఎలక్షన్స్‌లో ఎపీలో పోటీ చేయనున్నట్లు, ఈ విషయంపై ఇతర రాజకీయ పరిణామాలపై నాయకుల మధ్యచర్చ జరిగినట్లు సమాచారం. ఒకవేళ ఆయన గనుక ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎక్కడ నుంచి చేయొచ్చు అనే దానిపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఎంపీ అభ్యర్థిగా నిలబడనున్నారని ప్రచారం : అయితే, ఏపీ రాజకీయాల్లో ఎంట్రీపై వీవీ వినాయక్ మాత్రం ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. వీవీ వినాయక్ వైసిపీలో చేరతారనే ప్రచారం మాత్రం జోరందుకుంది. కాకినాడ, ఏలూరు లోకసభ నియోజకవర్గాల్లో ఆయన ఎంపీ అభ్యర్థిగా నిలబడనున్నారనే టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే ఆయన ఇక్కడ పర్యటనకు వచ్చినట్లు సమాచారం. అయితే, నెట్టింట్లో మాత్రం వీవీ వినాయక్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ఆయన అభిమానులు కొందరు చెబుతున్నారు. అయితే, ఇందులో వాస్తవెమెంతో తెలీదు. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications