Raj Tarun: ఏపీ ఎన్నికల్లో జనం కోరుకుంటోంది ఇదే- హీరో రాజ్ తరుణ్ ఆసక్తికర ట్వీట్..!

ఏపీలో ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తోంది. ఓటర్లు తమ అభిమాన పార్టీకి, నేతకూ పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నవారు. ఓటరు మద్దతు కోసం రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరాడుతున్నాయి. ఇలాంటి సమయంలో తమకే ప్రజల మద్దతు ఉందని చెప్పుకునేందుకు ప్రతీ రాజకీయ పార్టీ, అభ్యర్ధులు, నేతలు, కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు టాలీవుడ్ ప్రముఖులు, హీరోలు, ఆర్టిస్టులు తమ అభిప్రాయాల్ని ఎక్స్ లో పంచుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో విశాఖపట్నానికి చెందిన హీరో రాజ్ తరుణ్ కూడా స్పందించారు. ఏపీ ఎన్నికల్లో తమ మద్దతు ఎవరికో తేల్చిచెప్పేశారు. ఇంకా ఏపీ ఏం కోరుకుంటోందో కూడా రాజ్ తరుణ్ వెల్లడించారు. దీంతో ఇప్పుడు రాజ్ తరుణ్ ట్వీట్ వైరల్ అవుతోంది. విశాఖ నుంచి టాలీవుడ్ కు వచ్చి పలు చిన్న చిత్రాల్లో హీరోగా నటించిన రాజ్ తరుణ్ కు పరిశ్రమలో అందరితోనూ సన్నిహితంగా ఉంటాడనే ప్రచారం ఉంది.

Tollywood hero raj tarun extends support to pawan kalyan on X says people need you

ఈసారి ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా హీరో రాజ్ తరుణ్ ట్వీట్ చేశారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు ఇందులో చేశారు. ఆంధ్రప్రదేశ్ మంచి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలను తొలి రోజు నుంచే చూస్తున్నానని రాజ్ తరుణ్ ట్వీట్ లో తెలిపారు. ఇలాగే ఆశిస్తున్న కోట్లాది మందిలో ఒక్కడిగా మీరు రావాలని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ట్వీట్ లో పవన్ కళ్యాణ్ ను కోరారు. ఇప్పుడు జనం కోసం నువ్వు కావాలి అంటూ ఓ ట్యాగ్ లైన్ కూడా జోడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+