Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2024లో ఏపీ సీఎం ఆయనే..తేల్చేసిన టాలీవుడ్ హీరో సుమన్- రీజన్ ఇదేనట ..!

ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు అధికార వైసీపీ, విపక్ష టీడీపీ,జనసేన హోరాహోరీగా సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే తీవ్ర మాటలయుద్ధం కూడా కొనసాగిస్తున్నాయి. అధికార వైసీపీ మరోసారి ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతుంటే టీడీపీ,జనసేన, బీజేపీ మాత్రం పొత్తులతో బరిలోకి దిగిందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో రాబోయే ఎన్నికల్లో ఏపీ ఓటరు నాడి ఎలా ఉందనే దానిపై రకరకాల విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరో సుమన్ స్పందించారు.

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో హీరో సుమన్ ఇవాళ పూజలు నిర్వహించారు. పుల్లేటికుర్రు లో శ్రీ చౌడేశ్వరి దేవి సమేత రామలింగేశ్వరి ఆలయంలో సుదర్శన యాగం లో పాల్గొన్న సుమన్..తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో రాజకీయ పరిస్ధితులపై అవగాహన ఉన్న సుమన్.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవబోతోంది, సీఎం ఎవరు కాబోతున్నారనే దానిపై తన అంచనాల్ని వెల్లడించారు. అలాగే ఇందుకు గల కారణాలను కూడా విశ్లేషించారు. దీంతో ఇప్పుడు సుమన్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

herosumanjagan

ఏపీలో రానున్న ఎన్నికల్లో మళ్ళీ జగనే సీఎం అవుతారని టాలీవుడ్ హీరో సుమన్ తేల్చిచెప్పేశారు. ప్రతిపక్షాల పొత్తుల విషయంలో ఇంకా క్లారిటీ లేదని ఆయన తెలిపారు. అలాగే వారిలో సీఎం ఎవరో కూడా తెలియని కన్ఫూజన్ లో ఉన్నారన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వెనుకబడిన కులాలు జగన్ వెంటే ఉన్నారని సుమన్ పేర్కొన్నారు. జగన్ లా మేనిఫెస్టో అమలుచేసిన వారు భారతదేశంలో ఎవరు లేరని కూడా సుమన్ ప్రశంసల జల్లు కురిపించారు.

వైఎస్ జగన్ నవరత్నాల్లో 95శాతం అమలు చేశారని హీరో సుమన్ తెలిపారు. కరోనా సమయంలో ఆయన చేసిన సాయం ఎవరు మర్చిపోలేదన్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచేందుకు జగన్ రంగం సిద్దం చేసుకున్నారని సుమన్ క్లారిటీ ఇచ్చారు. విపక్షాల విషయంలో మాత్రం అలాంటి పరిస్ధితి లేదని, వారిలో కన్ఫ్యూజన్ శాపంగా మారబోతోందని సుమన్ స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు సుమన్ వ్యాఖ్యలపై రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+