వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కల్యాణ్‌తో ఇక సినిమాలు తీయదలచుకోలేదు- కారణం వెల్లడించిన బండ్ల గణేష్..!!

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనతో ఇక సినిమాలు తీయదలచుకోలేదని పేర్కొన్నారు. దీనికి గల కారణాలను కూడా ఆయన వివరించారు.

|
Google Oneindia TeluguNews

చిత్తూరు: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా దాదాపు 15 నెలల సమయం ఉంది. ఇంకొద్ది నెలలు గడిస్తే- ఎన్నికల సంవత్సరంలోకి అడుగు పెడుతుంది రాష్ట్రం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి- ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్లొచ్చనే ప్రచారం మొన్నటివరకు ఊపందుకుంది. ఈ ఏడాది చివరలో తెలంగాణతో పాటు ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా జగన్ కసరత్తు చేస్తోన్నారంటూ వార్తలొచ్చినప్పటికీ- వాటిని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోసిపుచ్చారు.

చీరెల పంపిణీలో భారీగా తొక్కిసలాట- నలుగురు దుర్మరణం: పలువురికి గాయాలు..!!చీరెల పంపిణీలో భారీగా తొక్కిసలాట- నలుగురు దుర్మరణం: పలువురికి గాయాలు..!!

 ఎన్నికల కోసం సమాయాత్తం..

ఎన్నికల కోసం సమాయాత్తం..

అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉన్నామని చెబుతోంది తెలుగుదేశం పార్టీ. ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్.. పాదయాత్ర చేస్తోన్నారు. యువగళం పేరుతో ఆయన జనం మధ్య ఉంటోన్నారు. కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 4,000 కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర చేయనున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో సాగుతోంది ఆయన యాత్ర.

పొత్తుల కోసం..

పొత్తుల కోసం..

దీనితో పాటు పొత్తుల కోసం టీడీపీ తనవంతు ప్రయత్నాలు సాగిస్తోంది. ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తమతో కలిసి వచ్చే పార్టీలతో మంతనాలు సాగిస్తోన్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ- టాప్ లో ఉంటోంది. తెలుగుదేశం-జనసేన మధ్య పొత్తుల వ్యవహారం దాదాపు ఖరారైందనే ప్రచారం ఇదివరకు జోరుగా సాగింది. సీట్ల పంపకాలు మాత్రమే బాకీ ఉన్నాయనేంత వరకూ వెళ్లిందీ అంశం.

జనసేనతోనే..

జనసేనతోనే..

ప్రస్తుతం జనసేన పార్టీ- బీజేపీతో పొత్తులో కొనసాగుతోంది. ఇదే విషయాన్ని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు పలుమార్లు స్పష్టం చేశారు కూడా. తమ పొత్తు జనంతోనే ఉంటుందనీ తేల్చి చెప్పారు. కుటుంబ పార్టీలకు తాము దూరమనీ పేర్కొన్నారు. జనసేనతో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొంటామని పునరుద్ఘాటించారు. వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం.. కుటుంబ పార్టీలని, వాటికి తాము ఎప్పుడూ దూరంగానే ఉంటామనీ అన్నారు.

చెరిసగం..

టీడీపీ-జనసేన పొత్తు కుదిరి అధికారంలోకి రాగలిగితే.. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి చేస్తారనే ప్రచారం సైతం గతంలో ఊపందుకున్న విషం తెలిసిందే. రెండున్నర సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని టీడీపీ-జనసేన పంచుకునేలా కార్యాచరణ రూపొందించుకున్నాయనే విషయం జనసేన గ్రూపుల్లో విస్తృతంగా సర్కులేట్ అయింది.

నెక్స్ట్ సీఎం..

నెక్స్ట్ సీఎం..

దీన్ని ఆధారంగా చేసుకుని- తాజాగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కల్యాణేనని తేల్చి చెప్పారు. పవన్ కల్యాణ్ తో సినిమాలను ఎప్పుడు తీస్తారంటూ ఓ ట్విట్టర్ యూజర్ అడిగిన ప్రశ్నకు బండ్ల గణేష్ సమాధానం ఇచ్చారు. తాను పవన్ కల్యాణ్ తో సినిమాలను చేయదలచుకోలేదని వివరించారు. కాబోయే ముఖ్యమంత్రి పవన్ కల్యాణేనని అందుకే సినిమాలు తీయదలచుకోలేదని చెప్పారు. బాస్ ఈజ్ నెక్స్ట్ సీఎం.. నో ఫిల్మ్ బ్రదర్ అని రిప్లై ఇచ్చారు.

English summary
Tollywood producer Bandla Ganesh predicts that the next CM of Andhra Pradesh will be Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X