కొడాలి నాని ఇలాకాలో ఓటర్లకు పంచేందుకు టన్నుల చీరలు; అప్పుడే ప్రలోభాలు షురూ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడే ఎన్నికల వేడి కొనసాగుతుంది. ఈసారి మళ్లీ అధికారంలోకి రావాలని వైసిపి వ్యూహాత్మకంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ప్రజల మద్దతును పొందే పనిలో ఉంది. ఇక వైసీపీ ప్రత్యర్ధి పార్టీలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కూడా ఎన్నికల ప్రచారంలో దూకుడును చూపిస్తున్నారు. ఎన్నికల ప్రచారం మాత్రమే కాదు అప్పుడే ఏపీలో ఎన్నికల ప్రలోభాల పర్వం కూడా మొదలైంది .
గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయటం కోసం రాజకీయ పార్టీల నాయకులు తాయలాలు రెడీ చేస్తున్నారు. తాజాగా గుడివాడలో పెద్ద మొత్తంలో చీరల బండిల్స్ ను గురువారం నాడు పోలీసులు పట్టుకున్నారు. కొడాలి నాని అనుచరుడిగా పేరున్న ఒక వ్యక్తి ఇంట్లో చీరల బండిల్స్ ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందటంతో రంగంలోకి దిగిన పోలీసులు చీరల బండిల్స్ గుర్తించారు .

ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు వాటిని సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న పోలీసులు వాటిని సీజ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న డీఎస్పీ శ్రీకాంత్ సుమారు రూ.30 లక్షల విలువ చేసే చీరలు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. డీఎస్పీ శ్రీకాంత్, పామర్రు ఎస్‌ఐ, సీఐలకు అందిన సమాచారంతోనే ఈ దాడి జరిగింది. మొత్తం 46 బండిల్స్ సీజ్ చేసిన పోలీసులు విజయవాడకు ఈ చీరలు బుకింగ్ ద్వారా వచ్చినట్లు గుర్తించారు.
175 నియోజకవర్గాలలో చీరల పంపిణీ జరిగేందుకు వాటిని ఇక్కడ డంప్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే ఈ చీరలు డంప్ చేసిన ఇల్లు కొడాలి నాని అనుచరుడిది కావటంతో ఇప్పుడు ఇది రాజకీయంగా దుమారంగా మారింది. ఓటర్లను ప్రలోభపెట్టటం కోసం ఈ చీరలు తెచ్చినట్టు టీడీపీ శ్రేణులు టార్గెట్ చేస్తున్నాయి.
వైసీపీ ఈ ఎన్నికల్లో గెలవటం కోసం ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తుందని, అందుకు ఇదే సాక్ష్యమని విమర్శిస్తున్నాయి. అయితే ఈ చీరలు దేనికోసం తెచ్చారు అన్న విషయంపై ఇంకా పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు.
కొడాలి నాని ఇలాకాలో ఓటర్లకు పంచేందుకు టన్నుల చీరలు; అప్పుడే ప్రలోభాలు షురూ..!!#KodaliNani #YSRCP #ApElections2024 #AndhraPradeshElections2024 #Oneindiatelugu pic.twitter.com/TlhbKqGfFz
— oneindiatelugu (@oneindiatelugu) April 5, 2024












Click it and Unblock the Notifications