దేశంలోనే టాప్-5 సూపర్ స్పీడ్ రైళ్లు... భూమి కంపిస్తుంది
మనదేశంలోని ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అత్యంత చౌకగా అందిస్తోంది భారతీయ రైల్వే. నిత్యం దేశవ్యాప్తంగా దాదాపు కోటిమంది ప్రయాణికులు రైళ్లద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. పండగరోజుల్లో, సెలవుదినాల్లో ఈ సంఖ్య ఇంకా పెంచుతుంది. రోజురోజుకు అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వస్తుండటంతో అన్నిరంగాల్లో ప్రజలు వేగాన్ని కోరుకుంటున్నారు. వారి అభిప్రాయాలకు అనుగుణంగా భారతీయ రైల్వే కూడా ప్రస్తుతం సెమీ హైస్పీడ్ రైళ్లయిన వందే భారత్ ను పట్టాలెక్కించింది. వచ్చే ఏడాది చివరలోకానీ 2026లో కానీ తొలి బులెట్ రైలు అందుబాటులోకి రాబోతోంది.
గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు
ప్రస్తుతం మన రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఈ వేగాన్ని తట్టుకునేలా పట్టాలను ఇంజనీర్లు డిజైన్ చేశారు. అయినప్పటికీ రైళ్లను మాత్రం సాధ్యమైనంత నెమ్మదిగానే నడుపుతుంటారు. భద్రతను దృష్టిలో పెట్టుకొని గంటకు 130 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్ల మధ్యే ఇవి నడుస్తున్నాయి. ప్రస్తుతం న్యూఢిల్లీ నుంచి భోపాల్ మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ మనదేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా పేరు తెచ్చుకుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తోంది. రెండో వేగవంతమైన రైలు నిజాముద్దీన్ నుంచి ఆగ్రా మార్గంలో నడుస్తోంది. కేవలం రెండు గంటల్లో నిజాముద్దీన్ నుంచి ఆగ్రాకు ఈ రైలు చేరుకుంటుంది. ఏసీతోపాటు వైఫై సౌకర్యం కూడా ఉంది.

మూడో స్థానానికి పడిపోయిన శతాబ్ది
మనదేశంలో సూపర్ స్పీడ్ రైళ్లంటే శతాబ్ది ఎక్స్ ప్రెస్ రైళ్లని పేరుండేది కానీ వాటి స్థానాన్ని వందే భారత్ రైళ్లు ఆక్రయించాయి. ప్రస్తుతం శతాబ్ది ఎక్స్ ప్రెస్ మూడో స్థానానికి పడిపోయింది. న్యూఢిల్లీ నుంచి భోపాల్ మధ్య నడుస్తున్న శతాబ్ది గంటకు 150 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. తర్వాత ఢిల్లీ నుంచి ముంబయి మధ్య నడుస్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్ గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. ఇది వేగంలో నాలుగో స్థానాన్ని సాధించింది. చివరగా ఐదో స్థానంలో న్యూఢిల్లీ నుంచి సీల్దా (పశ్చిమ బెంగాల్) వరకు నడుస్తున్న రైలు నిలిచింది. దీనివేగం గంటకు 135 కిలోమీటర్లు. ఈ రైళ్లల్లో ప్రయాణికులకు ఉచితంగా స్నాక్స్, మంచినీరు, ఉచిత వైఫై సౌకర్యాన్ని రైల్వే అందజేస్తోంది.












Click it and Unblock the Notifications