ఉమ్మడి కృష్ణాజిల్లాలో మూడు సీట్లకు టీడీపీలో గట్టి పోటీ-ముమ్మరంగా సర్వేలు..!
ఏపీలో రాజకీయంగా క్రియాశీలకంగా ఉండే జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి కృష్ణాజిల్లాలోని అసెంబ్లీ సీట్లకు ఇప్పుడు భారీ డిమాండ్ కనిపిస్తోంది. రాష్ట్రంలో అమరావతి రాజధాని స్ధానంలో మూడు రాజధానుల్ని వైసీపీ సర్కార్ తెరపైకి తెచ్చాక నెలకొన్న పరిస్దితుల నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న అంచనాలతో పోటీ పెరుగుతోంది. దీంతో నిన్న మొన్నటివరకూ సైలెంట్ గా ఉన్న నేతలు కూడా యాక్టివ్ అయిపోతున్నారు.
రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నా టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ జన్మస్ధలం ఉన్న కృషాజిల్లా అంటే టీడీపీలో ఉండే లెక్కలే వేరు. ఇక్కడ ప్రతీ సీటూ గెలిచేందుకు టీడీపీలో స్ధానిక నేతలతో పాటు విదేశాల్లో ఉన్న ఎన్నారైలు సైతం పనిచేస్తుంటారు. నిధుల్ని సైతం సమకూరుస్తుంటారు. అలాంటి కృష్ణాజిల్లాలో ఈసారి మూడు సీట్లు ఆసక్తి రేపుతున్నాయి. ఈ సీట్లలో టీడీపీ గెలుపుపై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో టికెట్ల కోసం గట్టి పోటీ కనిపిస్తోంది.

ఇలా కృష్ణాజిల్లాలో టీడీపీ అభ్యర్ధుల కోసం గట్టి పోటీ నెలకొన్న సీట్లలో పెనమలూరు, మైలవరం, తిరువూరు సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూడూ వైసీపీ సిట్టింగ్ సీట్లే. వీటిలో తిరిగి వైసీపీ గెలిచే అవకాశాలు లేవని అంచనాలు వేసుకుంటున్న టీడీపీలో ఆశావహులు తమకే సీటు ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ మూడు సీట్లలో కనీసం ముగ్గురేసి సీనియర్ నేతలు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. వీటి కోసం పార్టీ పెద్దల వద్ద తమ లాబీయింగ్ తో పాటు క్షేత్రస్దాయిలోనూ పావులు కదుపుతున్నారు.
పెనమలూరు సీటులో టీడీపీ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమ, వైసీపీ సిట్టింగ్ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. అలాగే మైలవరం సీటు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమతో పాటు బొమ్మసాని సుబ్బారావు ప్రయత్నిస్తున్నారు. అటు తిరువూరు సీటు కోసం ప్రస్తుత ఇన్ ఛార్జ్ శావల దేవదత్ తో పాటు అమరావతి జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు, తోకల రాజవర్ధన రావు పోటీ పడుతున్నారు. వీరితో పాటు వైసీపీ నుంచి వచ్చిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, గతంలో పోటీ చేసి ఓడిన జవహర్ వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ మూడు సీట్లపై టీడీపీ అధిష్టానం సర్వేలు చేయిస్తోంది.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications