టీడీపీ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ - అనూహ్య ట్విస్ట్..!?
టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న ఆనం రామనారాయణ రెడ్డికి ఆ పార్టీ ఏం చెబుతోంది.
సీనియర్ నేత ఆనం రామనారాయ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ ఎక్కడ నుంచి. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఆనం...కొంత కాలం పార్టీ పైన విధేయతతోనే ఉన్నారు. క్రమేణా పార్టీ నాయకత్వానికి..ఆనం కు మద్య గ్యాప్ పెరిగింది. సీనియర్ పొలిటీషయన్ అయిన ఆనం ప్రభుత్వం పైన ఓపెన్ గానే తన మనసులో అభిప్రాయాలను బయట పెట్టారు.
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కామెంట్స్ చేసారు. ఇదే సమయం లో ఆయన టీడీపీతో టచ్ లోకి వెళ్లారని ప్రచారం. అక్కడ నుంచి సీటు పైన హామీ వచ్చిన తరువాతనే వైసీపీ పైన తన వాయిస్ పెంచారని చెబుతారు. ఇంతకీ ఆనం టీడీపీ నుంచి ఆశించింది ఏంటీ.. టీడీపీ నేతలు చెబుతోందేంటి. ఆనం ఇప్పుడు ఏం చేయబోతున్నారు..

సొంత ప్రభుత్వంపైన వ్యతిరేక వ్యాఖ్యలు
2019 ఎన్నికల వేళ వైసీపీలో చేరిన ఆనం..ఆ ఎన్నికల్లో వెంకటగిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. కొంత కాలం క్రితం సొంత ప్రభుత్వం పైన చేసిన వ్యతిరేక వ్యాఖ్యలతో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోనే ఆనం రామ్ కుమార్ రెడ్డిని వైసీపీ ఇంఛార్జ్ గా నియమించారు. ఇక.. ప్రభుత్వం నిర్వహిస్తున్న గడప గడపకు ప్రభుత్వం బాధ్యతలను రాం కుమార్ రెడ్డి తీసుకున్నారు. ఆనం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందకు ఆనం సిద్దమవుతున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమనే అభిప్రాయంతో ఆనం కనిపిస్తున్నారు. ఈ ఏడాది నవంబర్ లోనే ఏపీలో ముందస్తుకు ఛాన్స్ ఉందని ఆనం అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో టీడీపీ నుంచి ఆనం పోటీ చేయాలని భావిస్తున్నట్లుగా ప్రచారం.

టీడీపీ నుంచి ఏ నియోజకవర్గంలో పోటీ
ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు సిటీలో ఒకసారి, రాపూరులో రెండు సార్లు, ఆత్మకూరులో ఒకసారి, వెంకటగిరి లో ఒక సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆనం వచ్చే ఎన్నికల్లో వెంకగిరి నుంచి పోటీ చేస్తారా అనేది సందేహమే. అక్కడ ఈ సారి వైసీపీ నుంచి నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. ఆత్మకూరు నుంచి ఆనంను బరిలో దింపే ఆలోచనలో టీడీపీ ఉందని చెబుతున్నారు. ఆనం 2009లోనే ఆత్మకూరు ఎమ్మెల్యేగా పని చేసారు.
అత్మకూరు ప్రస్తుతం మేకపాటి కుటుంబానికి కంచుకోటగా ఉంది. 2014,19 ఎన్నికల్లో మేకపాటి గౌతం రెడ్డి గెలుపొందారు. గౌతమ్ ఆకస్మిక మరణంతో అక్కడ ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి 2022లో ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఆనం ఆత్మకూరు లేదా నెల్లూరు సిటీ లో ఎక్కడ నుంచైనా పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. టీడీపీ అధినాయకత్వం మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది.

ఆనంకు మద్దతుగా పవన్ కల్యాణ్
వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంచిన ఆనం రామనారాయణ రెడ్డికి జనసేనాని ఆనం మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే ఆనం భద్రత గురించి డీజీపీ బాధ్యత తీసుకోవాలని పవన్ స్పష్టం చేసారు. ఆనంతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. ఇప్పుడు టీడీపీ - జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ..పవన్ మద్దతు ఆనంకు కలిసొచ్చే అంశంగా మారుతోంది. టీడీపీ అధినాయకత్వంతోనూ ఆనంకు మంచి సంబంధాలు ఉన్నాయి.అయితే, 2019లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు అక్కడ నుంచి ఆనం - కోటంరెడ్డి ఇద్దరూ టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇద్దరికీ ఈ మేర హామీ ఉందని చెబుతున్నారు. అయితే,కోటంరెడ్డికి సంబంధించి నెల్లూరు జిల్లా టీడీపీ నేతల నుంచే అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంద. ఆనం విషయంలో సీటు విషయం పైన చర్చ సాగుతున్నట్లు సమాచారం. దీంతో..ఈ ఇద్దరి విషయంలో టీడీపీకి ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకంటుందనేది ఆసక్తిని పెంచుతోంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications