కపిల తీర్థం జలపాతంలో విషాదం: మరో మృతదేహం, 8కి చేరిన మృతులు (ఫోటోలు)
తిరుపతి: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కపిల తీర్థం జలపాతంలో భక్తులు గల్లంతయ్యారు. ఆదివారం రాత్రి పదకొండున్నర గంటల సమయానికి ఏడు మృతదేహాలను వెలికి తీశారు. వీరిలో నలుగురు తిరుపతి చంద్రశేఖర రెడ్డి కాలనీకి, మరో ముగ్గురు మధురానగర్, యువజ్యోతి నగర్ వాసులు.
కపిలతీర్థం జలపాతం నుంచి మరో మృతదేహాన్ని రెస్క్యూ టీమ్స్ సోమవారం వెలికి తీశాయి. అత్ని వెంకటేశ్వర్లుగా గుర్తించారు. ఆదివారం సాయంత్రం ఏడు మృతదేహాలను వెలికి తీసిన విషయం తెలిసిందే
మృతులను శ్రీకాంత్, వెంకటేష్, లోహిత్, నిఖిల్, బాలాజీ, సచిన్ వర్మ, తౌసిద్‌లుగా, వెంకటేశ్వర్లుగా గుర్తించారు. మరికొందరు మృతి చెంది ఉండొచ్చన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఇంటినుంచి వెళ్లిన పిల్లలు శవాలయ్యారని తెలుసుకున్న తల్లితండ్రుల గుండెలు పగిలాయి.
సమాచారం తెలుసుకున్న టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇవో సాంబశివరావు, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పుష్కరిణిలోని మృతదేహాలను వెలికితీయించారు. మరికొందరు గల్లంతైనట్టు అనుమానాలు ఉండటంతో, అర్థరాత్రి వరకూ గాలింపు చర్యలు కొనసాగాయి.

కపిల తీర్థం జలపాతంలో విషాదం: ఏడు మృతదేహాల వెలికితీత
ఆదివారం సెలవుదినం కావడంతో జీవకోన, చంద్రశేఖర్‌రెడ్డి కాలనీలకు చెందిన సుమారు కొందరు యువకులు కపిలతీర్థంపై ఉన్న మొదటి కనుమ ప్రాంతంలోని నీటి కొలనుల్లో ఈత కొట్టేందుకు వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మూడు గంటలపాటు కుండపోత వర్షం కురిసింది.

కపిల తీర్థం జలపాతంలో విషాదం: ఏడు మృతదేహాల వెలికితీత
దీంతో వర్షపునీరు ఉద్ధృతంగా కపిలతీర్థం వైపు పోటెత్తింది. అయితే తిరుపతిలో వర్షం కురవకపోవడంతో జీవకోన, చంద్రశేఖర్‌రెడ్డి కాలనీలకు చెందిన శ్రీకాంత్, వెంకటేష్, లోహిత్, నిఖిల్, బాలాజీ, సచిన్‌వర్మ, బాబ్జాన్‌తోపాటు మరి కొందరు యువకులు నీటి కొలనుల్లో ఈత కొడుతున్నారు.

కపిల తీర్థం జలపాతంలో విషాదం: ఏడు మృతదేహాల వెలికితీత
సాయంత్రం 3.40 గంటల ప్రాంతంలో తిరుపతిలో స్వల్పంగా వర్షం కురవడం ప్రారంభమైంది. ఐదుగురు యువకులు ఈత కొడుతుండగా, మరో ఐదుగురు ముందుగా కొలనునుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో వర్షం పెరుగుతుండటంతో వెలుపలికి రమ్మని కొందరు యువకులు చెప్పినా కొలనులో ఉన్నవారు పెడచెవిన పెట్టారు.

కపిల తీర్థం జలపాతంలో విషాదం: ఏడు మృతదేహాల వెలికితీత
సాయంత్రం 5-15 నిమిషాల ప్రాంతంలో తిరుమల కొండల నుంచి వర్షపునీరు ఉద్ధృతంగా రావడంతో శ్రీకాంత్, వెంకటేష్, లోహిత్, నిఖిల్, బాలాజీ, సచిన్ వర్మ కొట్టుకుపోయి 75 అడుగుల కిందవున్న కపిలతీర్థంలోకి జారిపడి, నీటి ఉద్ధృతికి పుష్కరిణిలోకి కొట్టుకుపోయారు.

కపిల తీర్థం జలపాతంలో విషాదం: ఏడు మృతదేహాల వెలికితీత
కాగా అదృష్టవశాత్తూ కొలను గట్టుకు సమీపంలో ఉన్న బాబ్జాన్ నీటి ఉద్ధృతికి విసురుగా బయటపడ్డాడు. దీంతో గట్టుపైవున్న ఐదుగురు యువకులు భయంతో అక్కడనుంచి పారిపోయారు. బాబ్జాన్ స్నేహితుల కోసం గాలించాడు. సమాచారం అందుకున్న టిటిడి విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

కపిల తీర్థం జలపాతంలో విషాదం: ఏడు మృతదేహాల వెలికితీత
ముగ్గురు యువకుల శవాలను వెలికితీశారు. మరో యువకుని శవం పుష్కరణిలోని ఇనుప కమ్మీలకు చిక్కుకుపోవడంతో అతికష్టం మీద వెలికితీశారు. మరో ఇద్దరి జాడ తెలియాల్సి ఉంది. మృతి చెందిన వారిలో ముగ్గురు మోటార్ మెకానిక్‌లు కాగా, నిఖిల్ వర్మ (13) వేంకటేశ్వర చిల్డ్రన్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు.

కపిల తీర్థం జలపాతంలో విషాదం: ఏడు మృతదేహాల వెలికితీత
నిఖిల్ తల్లితండ్రులు సంధ్య, చంద్రశేఖర్ తమ బిడ్డ మరణించిన విషయం తెలుసుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.మృతుల శవాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.

కపిల తీర్థం జలపాతంలో విషాదం: ఏడు మృతదేహాల వెలికితీత
సోమవారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ప్రమాద ఘటన వివరాలు తెలుసుకున్న సిఎం చంద్రబాబు, హోం మంత్రి చినరాజప్ప దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిటిడి ఇవో, ఎస్పీల ద్వారా పూర్తి వివరాలు ఆరా తీశారు.

కపిల తీర్థం జలపాతంలో విషాదం: ఏడు మృతదేహాల వెలికితీత
మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు జరగకుండా దృష్టి సారించాలని సిఎం అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications