ఏపీలో ట్రామాడోల్‌ దుర్వినియోగం.. తనిఖీల్లో షాకింగ్ విషయాలు!

ట్రామాడోల్‌ తో పాటు ఇతర కఠిన నిబంధనలున్న మందుల కొనుగోలు, విక్రయాలపై ఏపీ ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 100 మందుల దుకాణాల్లో నిర్వహించిన తనిఖీల్లో 55 చోట్ల నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. వీటిలో 53 చిన్నస్థాయి ఉల్లంఘనలు కాగా, కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో రెండుచోట్ల పెద్ద మొత్తంలో మందుల కొనుగోలు, విక్రయాలు జరిగినా సంబంధిత బిల్లులు చూపించలేదు. అధికారులు కొనుగోలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వానికి అందిన సమాచారం మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆదేశాలతో ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌బాబు ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో గుర్తించిన అంశాలతో అధికారులు మంత్రి సత్యకుమార్‌కు నివేదిక అందజేశారు. అసలు ఈ తనిఖీల వెనుక జంగారెడ్డి గూడెం లో ట్రామాడోల్‌ దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారం ఉంది.

Tramadol misuse inspections Statewide inspections ordered by Minister rule violations at 55 places

తాజాగా జీలుగుమిల్లి గ్రామంలోని ఆయిల్‌పామ్‌ తోటలో పెద్ద సంఖ్యలో ఖాళీ, పగిలిన ఇంజెక్షన్‌ సీసాలు, వాడిన సిరంజీలు కనిపించడంతో జంగారెడ్డిగూడెం డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ అక్కడికి వెళ్లి పరిశీలించారు. అవి ట్రామాడెక్స్‌, ట్రామెక్‌ పేర్లతో ఉన్న ట్రామాడోల్‌ ఇంజెక్షన్లుగా గుర్తించారు. ట్రామాడోల్‌ను తీవ్రమైన నొప్పిని తగ్గించేందుకు వైద్యపరంగా ఉపయోగిస్తారు. అయితే మత్తు కలిగించే ప్రభావం ఉండటంతో కొందరు దీనిని మాదకద్రవ్యాలకు ప్రత్యామ్నాయంగా దుర్వినియోగం చేస్తున్నారు.

అందువల్ల వైద్యుల సూచన మేరకు, నిబంధనల ప్రకారం మాత్రమే ఈ మందును విక్రయించాలి. అయితే కొందరు మందులదుకాణాల నిర్వాహకులు మధ్యవర్తులతో కలిసి సరైన బిల్లులు, రికార్డులు లేకుండా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ట్రామాడోల్‌ తయారీసంస్థల ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పంపిణీ వివరాలను అధికారులు సేకరించి పరిశీలించారు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలోని కొన్ని మందుల దుకాణాలు పెద్ద మొత్తంలో ట్రామాడోల్‌ ఇంజెక్షన్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. తనిఖీలలో కొన్ని ఏజెన్సీల అక్రమాలు వెలుగుచూశాయి.

డ్రగ్స్‌ నియంత్రణ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జంగారెడ్డిగూడెం పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి జైలుకు పంపారు. అరెస్టయిన వారిలో మందుల దుకాణాల యజమానులు, ఒక ఉద్యోగి ఉన్నారు.జంగారెడ్డిగూడెం ఘటనతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో వెలుగుచూసిన అక్రమాలపై ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ తదుపరి చర్యలకు సిద్ధమైంది.

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. అదనంగా 5లక్షల ఇళ్ళు!
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం శుభవార్త.. అదనంగా 5లక్షల ఇళ్ళు!

పెద్ద మొత్తంలో అక్రమ లావాదేవీలు చేసిన మందుల దుకాణాల లైసెన్సులు రద్దు చేసేందుకు చర్యలు చేపడుతోంది.ట్రామాడోల్‌ లేదా ఇతర కఠిన నిబంధనలున్న మందులను అక్రమంగా తరలించడం, అనుమతి లేకుండా నిల్వ చేయడం, సరైన రికార్డులు లేకుండా విక్రయించడం వంటి చర్యలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+