Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టైర్లు పగిలే ఎండల్లో కార్లలో ప్రయాణం చేస్తున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీకోసమే!!

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రోళ్లు పగిలే ఎండలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇక ఎండల్లో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త అని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. విపరీతంగా ఎండలు ఉన్న సమయంలో కార్లలో వేగంగా ప్రయాణించటం కూడా డేంజర్ అని హెచ్చరిస్తున్నారు.

ఇక తాజాగా చోటు చేసుకున్న ఒక సంఘటన ఎండల సమయంలో జాగ్రత్తగా వాహనాలను నడపాలని తెలియ చెప్తుంది. నేడు తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అయితే ఈ రోడ్డు ప్రమాదం వెనుక విపరీతంగా ఉన్న ఎండ ప్రధాన కారణమని తెలుస్తుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..

 Traveling in cars

తెలుగురాష్ట్రాల్లో విపరీతంగా పెరిగిపోయిన ఎండల దెబ్బకు రోడ్లు సైతం నిప్పులగుండంగా మారాయి. దీంతో ఈరోజు మధ్యాహ్నం తూర్పుగోదావరి జిల్లా ఎర్నగూడెం వద్ద రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలింది. కార్ వేగంగా వెళుతుండటంతో ఒక్కసారిగా టైరు పేలడంతో అదుపుతప్పిన కారు ఎదురుగా వస్తున్న మెడికల్ కంటైనర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ప్రమాదంలో సంఘటనా స్థలంలోనే ఇద్దరు మరణించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొకరు గాయపడగా, వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. రోడ్డుపై వేడికి టైర్ బరస్ట్ అవడంతో, ఎదురుగా వచ్చే కంటెయినర్ ను కారు ఢీ కొట్టిందని, దీనివల్లే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని ఘటనా స్థలంలో ఉన్న వారు చెబుతున్నారు.

 Traveling in cars

అందుకే ఎండాకాలంలో పగటిపూట ప్రయాణం చేసే వారు జాగ్రత్త. కారులో ప్రయాణం చేస్తున్నాం కదా, ఏసీ ఉంది కదా అని అని విపరీతమైన వేగంతో దూసుకుపోతే, రోడ్లు నిప్పుల కొలిమిలా ఉంటున్నాయి. టైర్లు బద్దలయ్యే ఎండల ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే బీ కేర్ ఫుల్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+