ట్రెండ్ సెట్టర్ పవన్ కళ్యాణ్.. మహారాష్ట్ర ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్, జనసైనికులు ఖుష్!

మహారాష్ట్ర ఎన్నికలలో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని సాధించింది. అయితే మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం వెనుక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది పవన్ కళ్యాణ్ అని జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికలలో బిజెపి కూటమి అభ్యర్థుల తరఫున పలు ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం చేశారు.

తన విజయానికి పవన్ కళ్యాణ్ కారణం అన్న మహారాష్ట్ర ఎమ్మెల్యే
పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేసిన ప్రాంతాలలో బిజెపి అభ్యర్థులు విజయం సాధించారు. ఇక ఇదే విషయాన్ని ఈ ఎన్నికలలో బిజెపి తరఫున ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించిన సోలాపూర్ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోతే స్వయంగా తెలిపారు. తన విజయానికి పవన్ కళ్యాణ్ ప్రచారమే కారణమని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు.

Trend setter pawan kalyan Maharashtra MLA comments viral Janasena happy

మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రభావం
పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రాంతాలలో ఒకటైన సోలాపూర్ లో పవన్ మద్దతు ఇచ్చిన బిజెపి అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోతే విజయం సాధించడంతో ఆయన ఆపై మీడియాతో మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. పవన్ కళ్యాణ్ వల్లే తాను ఎన్నికలలో గెలిచారని పవన్ కళ్యాణ్ ప్రభావం మహారాష్ట్రలో కూడా చాలా ఉందని ఆయన పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్
సోలాపూర్ లో పవన్ కళ్యాణ్ చేసిన ర్యాలీ తనకు చాలా హెల్ప్ అయ్యిందని, రెండు గంటలు పవన్ కళ్యాణ్ చేసిన రోడ్ షోకు భారీగా జనాలు వచ్చి సపోర్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు .పవన్ కళ్యాణ్ తన మాటలతో మహారాష్ట్ర సోలాపూర్ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశారని పేర్కొన్నారు. ఇక సోలాపూర్ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

మహారాష్ట్ర ఎమ్మెల్యే వ్యాఖ్యలను వైరల్ చేస్తున్న జనసేన.. సంబరాలు
పవన్ అభిమానులు, జనసైనికులు బిజెపి ఎమ్మెల్యే దేవేంద్ర రాజేష్ కోతే వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎన్డీఏ కూటమిలో కీలక భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఎన్డీఏ కూటమి విజయానికి కారణం అయ్యాడని పవన్ అభిమానులు అంటున్నారు. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరుగుతుందని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+