పునాది లేకుండా గోడ కట్టారు.. సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిషన్ సంచలన రిపోర్ట్ ?

ప్రముఖ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సింహాచలం అప్పన్న సన్నిధిలో నిర్వహించిన చందనోత్సవంలో ఘోర అపశ్రుతి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. శ్రీ వరాహలక్ష్మీ శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో గోడ కూలిన ఘటనలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

అయితే ఈ ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై త్రిసభ్య కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని కమిషన్‌ వెల్లడించినట్లు తెలుస్తోంది. భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున నీరు, బురద గోడ వద్దకు చేరింది. పునాది బలంగా లేని గోడ కాబట్టి నీరు, బురద బరువుకు తట్టుకోలేక గోడ ఒక్కసారిగా కూలిపోయిందని కమిషన్ అంచనాకు వచ్చింది.

సింహాచలం ఘటన జరిగిన నేపథ్యంలో 72 గంటల్లోనే నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ఘటనపై.. మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌ కుమార్‌ అధ్యక్షతన, ఈగల్‌ విభాగాధిపతి ఐజీ రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు సభ్యులుగా త్రిసభ్య కమిషన్ విచారణ చేపట్టింది. పలు సంచలన విషయాలను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచింది. గోడను పునాదులు కుడా లేకుండా నిర్మించారు. వర్షపు నీరు వెళ్లేందుకు కనీసం గోడకు లీప్ హోల్స్ కూడా పెట్టలేదని తన ప్రాథమిక నివేదికలో పేర్కొంది.

అప్పన్న చందనోత్సవానికి 7 రోజుల ముందు ఈ గోడను హడావిడిగా నిర్మించినట్టు తేలిందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆలయాల అభివృద్ధి కోసం తీసుకొచ్చిన ప్రసాద్ స్కీమ్ లో భాగంగా గోడ నిర్మాణాన్ని తూతూమంత్రంగా నిర్మించారని పేర్కొంది. గోడ నిర్మాణానికి ఎలాంటి డిజైన్లు లేక పోగా పునాది కూడా లేకుండా నిర్మించేశారని ప్రాథమిక నివేదికలో కమిషన్‌ పేర్కొంది. గోడ నిర్మించే సమయంలోనూ ఎలాంటి తనిఖీలు చేయలేదని త్రిమెన్ కమిషన్ అభిప్రాయ పడింది.

ఇక ప్రముఖ మహిమాన్విత క్షేత్రం సింహాద్రి అప్పన్న ఆలయంలో ఏటా స్వామివారికి నిర్వహించే వార్షిక చందనోత్సవం వేడుకల సందర్భంగా ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

Trimen Commission Releases Report on Simhachalam Wall Collapse

సింహాచలం లక్ష్మీనరసింహ స్వామివారికి ప్రతి సంవత్సరం చందనోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో నిజరూప దర్శనం ఇస్తారు. నిజరూప దర్శనం చేసుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునే ఉన్న ఒడిశా నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. ఈ ఏడాది చందనోత్సవానికి దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు హాజరైనట్లు అంచనాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+