ఇటు అమరావతి-అటు వైజాగ్ స్టీల్-పవన్ కళ్యాణ్, కోదండరాం ఎంట్రీ-జగన్ కు ఉద్యమాల సెగ
ఏపీలో ఇప్పటివరకూ సాగుతున్న రెండు ఉద్యమాలు 24 గంటల వ్యవధిలో తమ రూపురేఖలు మార్చుకున్నాయి. మరింత తీవ్రతరం అయ్యేందుకు సిద్ధమయ్యాయి. వీటికి లభిస్తున్న మద్దతు, మారుతున్న రాజకీయాల్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ రెండు ఉద్యమాలు కూడా జగన్ సర్కార్ కు సంకటంగా మారబోతున్నాయి. ఇందులో ఒకటి మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర కాగా.. రెండవది ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమం. ఈ రెండూ తమ పథాను మార్చుకోవడం ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బందిపెట్టబోతుందో ఇప్పుడు చూద్దాం..

జగన్ సర్కార్ పై పోరు బాట
ఏపీలో వైసీపీ సర్కార్ పై వివిధ అంశాల్లో విపక్షాలు నిత్యం పోరుబాట పడుతూనే ఉన్నాయి. ప్రభుత్వ విధానాలు, విపక్షాల అణచివేత, అప్పులు, ఇసుక, మైనింగ్ మాఫియాలు.. ఇలా ఒక్కో అంశంపై విపక్షాలు పోరు కొనసాగుతూనే ఉంది. అయితే ఇవన్నీ రాజకీయ ప్రేరేపితం అనుకున్నా.. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న పోరు, అమరావతిలో రాజధాని కావాలంటూ సాగుతున్న పోరు గమనిస్తే వీటిలో రాజకీయాల పాత్ర కంటే స్ధానిక ప్రయోజనాలే ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో ఏదో ఒక సమయంలో వీటికి ప్రజల మద్దతు, సానుభూతి లభిస్తూనే ఉంది.

అమరావతి ఉద్యమం టూ మహా పాదయాత్ర
అమరావతిలో ఉన్న ప్రస్తుత ఏపీ రాజధానిని వైజాగ్, కర్నూలుకు విస్తరిస్తూ మూడు రాజధానుల ప్రక్రియకు వైసీపీ సర్కార్ రెండేళ్ల క్రితం తెరలేపింది. అప్పటి నుంచీ అమరావతి రగులుతూనే ఉంది. అమరావతి ఉద్యమం టీడీపీ నడిపిస్తున్న ఉద్యమం అంటూ పైకి ఎన్ని మాటలు చెప్తున్నా వైసీపీ సర్కార్ లోనూ ఈ ఉద్యమంపై పూర్తి క్లారిటీ ఉంది. దీంతో అమరావతి ఉద్యమంపై ముందునుంచీ ఉక్కుపాదం మోపుతోంది. అయితే దాదాపు రెండేళ్లుగా అమరావతి కోసం ఉద్యమాలు చేసిన రైతులు.. ఇప్పుడు న్యాయస్ధానం టూ దేవస్ధానం రూపంలో తుళ్లూరు నుంచి తిరుమల వరకూ మహాపాదయాత్రకు సిద్ధమయ్యారు. దీనికి విపక్షాలన్నీ మద్దతు ప్రకటిస్తున్నాయి. దీంతో వైసీపీ సర్కార్ ఇరుకునపడటం ఖాయంగా కనిపిస్తోంది.

వైజాగ్ స్టీల్ ఉద్యమంలోకి పవన్ కళ్యాణ్
ఒకప్పుడు నవరత్న సంస్ధల్లో ఒకటిగా వెలిగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను నష్టాల పేరుతో ప్రైవేటీకరణకు కేంద్రం సిద్ధమవుతోంది. ప్రైవేటీకరణ పేరు చెప్పగానే లాభాల్లోకి వచ్చేసినా కేంద్రం మాత్రం పాత నష్టాల్ని సాకుగా చూపుతూ ప్రైవేటీకరణ తప్పదంటోంది. ఇందుకోసం జోరుగా ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఏడాది లోపు ప్రైవేటీకరణ పూర్తి కావడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో స్టీల్ ప్లాంట్ ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది. తాజాగా దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జత కలిశారు. ఇప్పటికే కేంద్రంలో అధికార బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి దూకడంతో రాజకీయాలు మరింత వేడెక్కబోతున్నాయి.

స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కోదండరామ్ మద్దతు
ప్రొఫెసర్ కోదండరామ్ పేరు చెబితే ఉవ్వెత్తున్న ఎగసిపడ్డ తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తుంది. ఆ ఉద్యమంలో సంపాదించుకున్న మైలేజ్ సాయంతో రాజకీయ పార్టీ స్ధాపించి విఫలమైన కోదండరామ్ ప్రస్తుతం సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోరుకు ఆయన తాజాగా మద్దతు ప్రకటించారు. కేంద్రం ప్రైవేటీకరణ చేస్తూ పోతే దేశంలో సంస్ధల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందంటున్న కోదండరామ్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుపరం కానివ్వకుండా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోరులోకి కోదండరామ్ ఎంట్రీ కచ్చితంగా వైసీపీ సర్కార్ ను ఇరుకునపెట్టబోతోంది.
Recommended Video

జగన్ మెడకు అమరావతి, వైజాగ్ స్టీల్ ఉద్యమాలు ?
ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతమంది చెప్పినా వినిపించుకోకుండా మానుకోట రైల్వేస్టేషన్ కు వెళ్లి ఇబ్బందులపాలైన వైఎస్ జగన్ ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు వైసీపీ సర్కార్ హయాంలో మూడు రాజధానుల ఏర్పాటుతో అమరావతి ఉద్యమానికి ఆయనే ఊపిరిపోశారు. ఆ తర్వాత కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయంతో వైజాగ్ స్టీల్ పోరు రూపంలో మరో ఉద్యమం మొదలైంది. ఈ రెండు ఉద్యమాలు తాజాగా తమ రూపు రేఖలు మార్చుకుని తీవ్రతరం అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో సీఎం జగన్ కు ఈ రెండు ఉద్యమాల సెగ తగలబోతోంది. అటు తాను మొదలుపెట్టిన మూడు రాజధానుల ప్రక్రియ పూర్తికాకపోవడంతో అమరావతి సెగ తగులుతూనే ఉంది. ఇప్పుడు రైతుల పాదయాత్ర రూపంలో ఈ ఉద్యమం సజీవంగానే ఉందని మరోసారి మీడియా సాక్షిగా నిరూపణ కాబోతోంది. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోరుకు పవన్, కోదండరామ్ మద్దతుతో ఈ ఉద్యమం కూడా తీవ్రం కానుంది. అదే సమయంలో కేంద్రంపై విమర్శలు చేసే పరిస్ధితి లేకపోవడంతో వైసీపీ మెడకు చుట్టుకోబోతోంది.
-
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
విశాఖ-చర్లపల్లి ఎక్స్ ప్రెస్ లో కీలక మార్పు-ఇకపై ఇలా..! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..!












Click it and Unblock the Notifications