జగన్ కేసుల్లో భారీ ట్విస్ట్- నిందితులకు హైకోర్టు షాక్- సీబీఐకి కీలక ఆదేశాలు

ఏపీ సీఎం వైఎస్ జగన్ పై దాఖలైన అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి తెలంగాణ హైకోర్టు తాజాగా షాకిచ్చింది. సీబీఐ దాఖలు చేసిన వేర్వేరు ఛార్జిషీట్లలో నిందితులుగా ఉన్న వారిలో ఒకటి కంటే ఎక్కువ కేసుల్లో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. దీంతో వీరంతా ఒక్కో కేసులో గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా తమకు విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు. దీంతో అలా కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. నిందితులు దాఖలు చేసిన విముక్తి పిటిషన్లపై సీబీఐ దాఖలు చేసిన కేసుల ఆధారంగానే విచారణ చేపట్టాలని నిర్ణయించింది. దీంతో వీరంతా ప్రతీ కేసులోనూ తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది.

 జగన్ కేసుల నిందితుల పిటిషన్లు

జగన్ కేసుల నిందితుల పిటిషన్లు

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ నమోదు చేసిన ఛార్జిషీట్లలో జగన్ తో పాటు దాదాపు 100 మందికి పైగా సహ నిందితులు ఉన్నారు. వీరంతా కొన్నళ్లుగా తమపై సీబీఐ కోర్టు విచారణను నిలిపేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయిస్తూ వస్తున్నారు. ఇందులో కొందరికి విముక్తి కూడా లభించింది. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పుల్ని ప్రస్తావిస్తూ వీరంతా ఊరట పొందుతున్నారు. దీంతో మిగిలిన నిందితులు కూడా తమకు కూడా వారి తరహాలోనే విముక్తి కల్పించాలని హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. వారికి వర్తింపచేసిన తీర్పులనే తమకూ వర్తింపచేయాలని హైకోర్టును కోరుతువ్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

 సీబీఐ అభ్యంతరాలివే

సీబీఐ అభ్యంతరాలివే

జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న వారంతా ఓ కేసులో తమకు విముక్తి లభించగానే మిగతా కేసుల్లోనూ తమకు విముక్తి కల్పించాలని పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ కేసులన్నింటిలోనూ ప్రధానంగా నీకిది-నాకది ( క్విడ్ ప్రోకో) ఆరోపణలే ఉన్నాయంటూ నిందితులు విముక్తి కోరుతున్నారు. దీంతో అలా ఒకే ఆరోపణలు ఉన్నాయన్న కారణంతో విముక్తి కల్పించడం కుదరదని సీబీఐ అభ్యంతరాలు లేవనెత్తుతోంది. అలా అయితే అన్ని కేసుల్లోనూ నిందితులకు విముక్తి దొరుకుతుందని హైకోర్టు దృష్టికి తెచ్చింది. కాబట్టి కేసుల తీవ్రత ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలని హైకోర్టును కోరింది.

 జగన్ సహ నిందితులకు హైకోర్టు షాక్

జగన్ సహ నిందితులకు హైకోర్టు షాక్

సీబీఐ దాఖలు చేసిన అక్రమాస్తుల కేసులో సీఎం జగన్ తో పాటు ఉన్న సహ నిందితుల్లో పలువురు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో పలు కోర్టులు ఇచ్చిన తీర్పులు ప్రస్తావిస్తూ సీబీఐ దాఖలు చేసిన అన్ని కేసుల నుంచి తమకు విముక్తి కల్పించాలని పిటిషన్లు వేశారు. దీంతో వీరందరికీ గంపగుత్తగా విముక్తి కల్పించడం కుదరదని హైకోర్టు తేల్సేసింది. వీరిపై సీబీఐ నమోదు చేసిన కేసుల ఆధారంగా విడివిడిగా పిటిషన్లు విచారించి దోషులా కాదా అన్నది తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో వీరంతా కచ్చితంగా తమపై నమోదైన ప్రతీ కేసులోనూ హైకోర్టులోనూ విచారణ ఎదుర్కోవాల్సిందే.

 సీబీఐకి హైకోర్టు కీలక ఆదేశాలు

సీబీఐకి హైకోర్టు కీలక ఆదేశాలు

సీబీఐ దాఖలు చేసిన కేసుల్లో జగన్ సహ నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్లపై కేసుల వారీగా విచారణ నిర్వహించాలని నిర్ణయించిన హైకోర్టు.. సీబీఐకి కీలక ఆదేశాలు ఇచ్చింది. జగన్ కేసుల్లో సహనిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కోసం సీబీఐ కేసుల వారీగా నిందితుల జాబితా సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీబీఐ గతంలో సీబీఐ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లలో పేర్కొన్న ప్రకారం నిందితుల జాబితాను కేసుల వారీగా హైకోర్టుకు సమర్పించనుంది. వాటిపై కేసు తీవ్రత ఆధారంగా విచారణ జరిపి తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది. అదే సమయంలో నిందితులపై దాఖలైన కేసుల్ని గంపగుత్తగా కొట్టేయడానికీ వీలుండదు.

 శ్రీలక్ష్మికీ దక్కని ఊరట

శ్రీలక్ష్మికీ దక్కని ఊరట

అటు ఓబుళాపురం గనుల తవ్వకాలకు అనుమతిచ్చిన కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న ఏపీ క్యాడర్ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి కూడా హైకోర్టులో ఊరట లభించలేదు. ఓబుళాపురం సరిహద్దుల వివాదం తేలేవరకూ తనపై సీబీఐ విచారణ జరగకుండా మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆమె తప్పనిసరిగా సీబీఐ కోర్టులో జరుగుతన్న విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఇప్పటికే ఆమె దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ పై సీబీఐ కోర్టులో వాదనలు వినిపించాల్సి ఉంది. వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలన్న శ్రీలక్ష్మి వాదనపై స్పందించిన సీబీఐ కోర్టు ఇప్పటికే కోర్టు ఖర్చుల కింద వెయ్యి రూపాయలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+