చంద్రబాబుకు మరో సంకటం? విజయవాడ, కర్నూలు మధ్య పోటీ..!
ఏపీలో రెండు నెలల క్రితం ఏర్పాటైన కూటమి సర్కార్ గతంలో జరిగిన తప్పిదాలను సవరించుకుంటూ నవ్యాంధ్ర నిర్మాణం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇందులోనూ సమస్యలు తప్పడం లేదు. ఇదే క్రమంలో తాజాగా రాష్ట్రానికి సంబంధించిన ఓ కీలక కార్యాలయం ఏర్పాటు కోసం కీలక నగరాలైన విజయవాడ, కర్నూలు మధ్య పోటీ నెలకొంది. ఇందులో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన పరిస్ధితి సీఎం చంద్రబాబుది. ఇందులో ఏదైనా తేడా జరిగితే మాత్రం సమస్య మరింత ముదరడం ఖాయంగా కనిపిస్తోంది.
రాష్ట్ర విభజన తర్వాత కృష్ణా నదీ జలవివాదాల పరిష్కారం కోసం బోర్డును హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. తెలుగు రాష్టాల్లో ప్రవహిస్తున్న కృష్ణానది ఏపీలో తన ప్రయాణం ముగిస్తుంది. దీంతో చివరి రాష్ట్రమైన ఏపీలో కృష్ణాబోర్డు కార్యాలయం ఏర్పాటు కోసం గతంలో పలు ప్రయత్నాలు జరిగాయి. అయితే దీన్ని తమ ప్రాంతంలోనే, తమ నగరంలోనే ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వాలపై ఒత్తిడి వచ్చింది. ఈ క్రమంలోనే గత వైసీపీ సర్కార్ విశాఖలో ఏర్పాటు కోసం ప్రయత్నించింది.

అయితే రాయలసీమ పక్కగా ప్రవహిస్తూ కృష్ణాజిల్లాలో సముద్రంలో కలుస్తున్న కృష్ణానదీ యాజమాన్య బోర్డును విశాఖలో పెట్టడం ఏంటనే ప్రశ్నలు వినిపించాయి. దీంతో అప్పటి జగన్ సర్కార్ వదిలేసింది. ఇప్పుడు కూటమి సర్కార్ ముందు మాత్రం విజయవాడ, కర్నూలులో ఏదో ఒక చోట ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ కార్యాలయం విజయవాడలోనే పెట్టబోతున్నారనే సమాచారంతో రాయలసీమ నేతలు అప్రమత్తమయ్యారు. తాజాగా కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజును కలిసిన రాయలసీమ నేతలు కర్నూలులోనే కేఆర్ఎంబీ ఆఫీసు ఏర్పాటు చేయాలని కోరారు.
అయితే ప్రస్తుత పరిస్ధితుల్లో చంద్రబాబు కర్నూలును ఎంచుకుంటారా లేక విజయవాడలోనే ఈ ఆఫీసు పెట్టేందుకు సిద్ధపడతారా అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు రాయలసీమలోనే పుట్టినా ఆ ప్రాంతానికి ఏమీ చేయలేదని ఆయన ప్రత్యర్థులు ఆరోపించేవారు. ఇప్పుడు కేఆర్ఎంబీ కార్యాలయం విజయవాడలో పెడితే మరోసారి అదే విమర్శలు చంద్రబాబు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో సీఎం నిర్ణయం ఏంటో తేలాల్సి ఉంది.
-
ఇప్పుడు తిప్పండి చక్రం..!! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..!












Click it and Unblock the Notifications