సంక్రాంతి కోడికి ఏపీలో కష్టమేనా ? పందాలపై ఉక్కుపాదం-ఈసారి డ్రోన్లతో నిఘా-హైకోర్టులో పిటిషన్

ఏపీలో సంక్రాంతి వస్తుందంటే చాలు ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలే. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో అందునా గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందాలు దేశ విదేశాల్లో సైతం పేరు తెచ్చుకున్నాయి. అయితే ఈసారి కోడి పందాలు సజావుగా సాగే అవకాశాలు కనిపించడం లేదు. దీనికి కారణం ప్రభుత్వం దీనిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించడమే. హైకోర్టు ఉత్తర్వుల్ని ఈసారి పూర్తిస్దాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతుండగా.. ఉల్లంఘనలపై అటు హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది.

 సంక్రాంతి కోడి పందాలు

సంక్రాంతి కోడి పందాలు

ఏపీలో సంక్రాంతి కోడి పందాలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. మిగతా కోస్తా జిల్లాల్లోనూ పందాలు జరిగినా ఇక్కడ జరిగే పందాలు, వాటికి జరిగే ఏర్పాట్లు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. ఇక్కడ జరిగే కోడి పందాలకు మన రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు తరలిరావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే జీవహింస పేరుతో కోడి పందాలకు అడ్డుకట్ట వేసేందుకు గతం నుంచీ ప్రయత్నాలు జరుగుతుండటం, వాటికి వ్యతిరేకంగా కోర్టుల్లో పోరాడి పందాలు నిర్వహించుకోవడం ఇక్కడ సర్వసాధారణమే. అయితే హైకోర్టు గతంలో కోళ్లకు కత్తులు కట్టి పందాలు నిర్వహించొద్దని ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు బెట్టింగ్ పై నిషేధం ఉండటంతో పందాల నిర్వహణకు విఘాతం కలుగుతోంది. దీంతో ఈసారి కోడి పందాలపై మరోసారి ఉత్కంఠ నెలకొంటోంది.

 సర్కార్ ఉక్కుపాదం

సర్కార్ ఉక్కుపాదం

గోదావరి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో జరిగే కోడి పందాలపైనా ఈసారి ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా సంక్రాంతి కోడి పందాలపై గట్టి నిఘా పెట్టాలని, కోడి పందాలు ఆడతారని సమాచారం అందితే బెండోవర్లు చేయాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఈసారి కోడి పందాల నిర్వాహకులపై పోలీసులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీలు కింది స్దాయి అధికారులతో సమావేశాలు నిర్వహించి సంక్రాంతి కోడి పందాల్ని అడ్డుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.

 ఈసారి డ్రోన్ కెమెరాలతో నిఘా

ఈసారి డ్రోన్ కెమెరాలతో నిఘా


సంక్రాంతి కోడి పందాల సందర్భంగా నిర్వాహకులు చేపట్టే ఏర్పాట్లపై నిశితంగా నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో పోలీసులు ఈసారి డ్రోన్ కెమెరాలతో పందాల బరుల్ని గుర్తించేందుకు సిద్ధమవుతున్నారు. వీటితో పాటు గుండాట, పేకాట స్ధావరాల గుర్తింపు కోసం కూడా డ్రోన్ కెమెరాలు వాడబోతున్నారు. అంతే కాదు పందాలకు వాడే కత్తుల తయారీదారులపై కూడా నిఘా పెట్టి ముందస్తుగా అరెస్టులు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కోడి కత్తుల తయారీదారులు సైతం బెంబేలెత్తుతున్నారు.

 కోడి పందాలతో కోవిడ్ వస్తుందని పిటిషన్

కోడి పందాలతో కోవిడ్ వస్తుందని పిటిషన్


పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే కోడి పందాలకు ఏర్పాట్లు శరవేగంగా సాగిపోతున్నాయి. దీంతో వీటిని అడ్డుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ముఖ్యంగా కోడి పందాల నిర్వహణ వల్ల ఈసారి కోవిడ్ వ్యాప్తి చెందే ప్రమాదం కూడా ఉందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోడి పందాలతో పాటు జూదం, అక్రమ మద్యం అమ్మకాలు అడ్డుకోవాలని కోరుతూ పిటిషనర్ హైకోర్టును కోరారు. దీంతో హైకోర్టు ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. త్వరలో దీనిపై విచారణ చేపట్టి ఆదేశాలు ఇవ్వనుంది.

కోడిపందాలకు అడ్డుకట్ట సాధ్యమేనా ?

కోడిపందాలకు అడ్డుకట్ట సాధ్యమేనా ?

ప్రతీ ఏటా పోలీసులు ఇంతకు మించిన హడావిడి చేయడం, చివరి నిమిషంలో చేతులెత్తేయడం ప్రతీ ఏటా జరుగుతూనే ఉంది. అందుకే పందెపు రాయుళ్లు ఎప్పుడూ ధీమాగా ఉంటుంటారు. దీనంతటికీ ప్రధాన కారణం ప్రజాప్రతినిధుల జోక్యమే. ప్రజాప్రతినిధులు దగ్గరుండి మరీ కోడి పందాలు నిర్వహిస్తుండటంతో పోలీసులు కూడా జోక్యం చేసుకోలేని పరిస్ధితులు ఎప్పుడూ తలెత్తుతుంటాయి. వీటిపైనే హైకోర్టులో సైతం కేసులు పడుతుంటాయి. అయినా పందాలకు మాత్రం అడ్డుకట్ట వేయడం ప్రభుత్వాలకూ, అధికారులకూ సాధ్యం కావడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+