Huzurabad లో టీఆర్ఎస్ - బద్వేలులో వైసీపీ ఆధిక్యత: పోస్టల్ బ్యాలెట్ లో అధికార పార్టీలకే...!!
ఏపీ..తెలంగాణల్లో జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆరంభమైంది. అందులో బాగంగా ముందుగా హుజూరాబాద్ - బద్వేలులో పోస్టల్ బ్యాలెట్స్ ను లెక్కించారు. రెండు చోట్ల అధికార పార్టీలే అధిక్యతలో ఉన్నాయి. హుజూరాబాద్ లో 753 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. అందులో అధికార టీఆర్ఎస్ కు ఆధిక్యత దక్కింది. ఇక, ఈవీఎంల లెక్కింపు ప్రారంభం కానుంది. పోతిరెడ్డిపేట్ గ్రామం (పోలింగ్ స్టేషన్)తో లెక్కింపు మొదలవుతుంది. చివరిగా కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి (పీఎస్ నెం.305)కి చెందిన ఈవీఎంలో ఓట్లు లెక్కిస్తారు. 14 టేబుళ్లపై మొత్తం 22 రౌండ్లుగా ఈ ప్రక్రియ కొనసాగనుంది.
హుజూరాబాద్ పోస్టల్ బ్యాలెట్ లో మొత్తం 723 ఓట్లు పోలయ్యాయి. అందులో టీఆర్ఎస్ కు 503 రాగా, బీజేపీకి 159 పోలయ్యాయి. కాంగ్రెస్ కు 32 ఓట్లు వచ్చాయి. ఇక, 14 ఓట్లు చెల్లనివిగా అధికారులు తేల్చారు.

పోస్టల్ బ్యాలెట్ లో అధికార పార్టీలకే
ఒక్కోరౌండ్‌కు సగటున 30 నిమిషాలు చొప్పున పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 86.64 శాతం ఓటింగ్ శాతం నమోదు కావడం.. పోలైన ఓట్లు 2 లక్షలు దాటడంతో ఫలితం అధికారికంగా వెలువడే సరికి సాయంత్రం అవుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ట్రెండ్ తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీలోని బద్వేలులో పోస్టల్ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉంది. రిటర్నింగ్ అధికారి, అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు.

కాసేపట్లో తొలి రౌండ్ ఫలితం
మొత్తం 235 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. రిటర్నింగ్ అధికారి, అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. గరిష్టంగా 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12గంటలకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. ఇప్పటివరకు సర్వీసు ఓటర్లు, 80 ఏళ్లు పైబడిన, దివ్యాంగుల ఓట్లు మొత్తం 235 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. ఓట్లు లెక్కించే సమయానికి సర్వీసు ఓటర్ల ఓట్లు అందితే వాటిని కూడా కలిపి లెక్కిస్తారు.
Recommended Video

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఆసక్తి కరంగా
నియోజకవర్గంలో మొత్తం 2,15,240 ఓట్లు ఉండగా, 1,47,213 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 68.39 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ టీడీపీ..జనసేన పోటీలో లేకపోవటంతో భారీ మెజార్టీ పైన వైసీపీ అంచనాలు పెట్టుకుంది. బీజేపీ..కాంగ్రెస్ సైతం గట్టి పోటీ ఇచ్చాయని భావిస్తున్నాయి. ఇక్కడ మధ్నాహ్నానికి తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు ఈ రెండు ఉప ఎన్నికల ఫలితాల ద్వారా రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications