ఉదయనిధి కామెంట్స్ పై టీటీడీ ఛైర్మన్ భూమన ఫైర్-అలజడి రేపేందుకేనంటూ..

సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. సనాతన ధర్మాన్ని మలేరియాతో పోలుస్తూ జూనియర్ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే దేశంలో హిందూసంఘాలు, బీజేపీ మండిపడుతున్నాయి. ఈ వ్యాఖ్యల్ని విపక్ష ఇండియా కూటమికి ఆపాదిస్తూ ఎన్డీయే పార్టీలు ఇప్పటికే విమర్శలకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీకి అనధికార మిత్రపక్షంగా ఉన్న వైసీపీ కూడా స్పందించింది.

సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని టీటీడీ ఛైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతూ భూమన పలు వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలు అలజడి సృష్టించేలా ఉన్నాయని భూమన వ్యాఖ్యానించారు. ఇవాళ టీటీడీ అన్నమయ్య భవన్ లో జరిగిన టీటీడీ బోర్డు సమావేశం తర్వాత భూమన వీటిపై స్పందించారు.

udayanidhi stalin bhumana karunakar reddy

టీటీడీ ఛైర్మన్ గా, ఓ రాజకీయ నేతగా ఉదయనిధి వ్యాఖ్యల్ని ఖండిస్తున్నట్లు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఈ వ్యాఖ్యలు సమాజంలో అలజడి రేపేందుకే తప్ప ఎందుకూ పనికిరావంటూ వ్యాఖ్యానించారు. తద్వారా టీటీడీ ఛైర్మన్ గా, వైసీపీ స్టాండ్ నూ భూమన వినిపించినట్లయింది. ఇప్పటికే బీజేపీ సహా పలు పార్టీలు ఉదయనిధి వ్యాఖ్యలపై మండిపడుతుండగా.. ఆయన మాత్రం వాటిని సమర్ధించుకుంటున్నారు. దీంతో ఇవాళ వైసీపీ నుంచి వచ్చిన తొలి స్పందన ఇదే కావడం విశేషం.

మరోవైపు ఉదయనిధి వ్యాఖ్యల విషయంలో ఇండియా కూటమి పార్టీలు దూరంగా ఉంటున్నాయి. అది కేవలం డీఎంకే వ్యక్తిగత విషయంగా అవి భావిస్తున్నాయి. దీంతో డీఎంకే కూడా స్వయంగా వీటిని ఎదుర్కొంటోంది. అధికార బీజేపీ నుంచి ఎదురుదాడి మరింత ఎక్కువైతే ఆ తర్వాత డీఎంకే ఎలా స్పందిస్తున్నది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+