చంద్రబాబు ముందే ఛైర్మన్ Vs ఈవో వాగ్వాదం, రచ్చ..!!
టీటీడీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుపతి తొక్కిసలాట ఘటన పైన దేశ వ్యాప్తంగా స్పందన కనిపించింది. ఘటనతో తిరుపతికి వెళ్లిన చంద్రబాబుకు టీటీడీలో ఏం జరుగుతుందో అర్దం కాని పరిస్థితి ఏర్పడింది. ఘటన పైన సమీక్ష వేళ ఛైర్మన్, ఈవో ఇద్దరూ ఏక వచనంతో చంద్రబాబు ముందే తీవ్ర వాగ్వాదానికి దిగారు. తొక్కిసలాట అంశం పక్కన పెట్టి వ్యక్తి గత అంశాల పైన రచ్చకు దిగారు. దీంతో, చంద్రబాబు మందలించారు. ఈ వ్యవహారం టీటీడీలో ఇప్పుడు కొత్త వివాదంగా మారుతోంది.
ఛైర్మన్ వర్సస్ ఈవో
తిరుపతి తొక్కిసలాట ఘటనతో టీటీడీ పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనతో తిరుపతి చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీలో లోపాలు అర్దమయ్యాయి. టీటీడీ ఛైర్మన్, ఈవో, ఏఈవో మధ్య సమన్వయం లేని విషయం స్పష్టమైంది. తొక్కిసలాట పైన సమీక్ష వేళ ముఖ్యమంత్రి, మంత్రుల సమక్షంలోనే ఛైర్మన్ .. ఈవో వాదులాడుకున్నారు. సంయమనం కోల్పోయారు. విచక్ష ణ మరిచారు. ముఖ్యమంత్రి ముందే 'నువ్వు నాకేం చెప్పడంలేదు' అంటూ చైర్మన్ బీఆర్ నాయుడు అనటం... 'అన్నీ చెబుతూనే ఉన్నాం' అని ఈవో శ్యామలరావు సమాధానంతో వాదన మొదలైంది. ముఖ్యమంత్రి వీరిద్దరి వివాదం చూసిన తరువాత సీరియస్ అయ్యారు.

ఏకవచనం తో వాగ్వాదం
తొక్కిసలాట ఘటన పైన జరిగిన ఈ సమీక్షలో సమన్వయం గురించి చర్చకు వచ్చింది. దీంతో, స్పందించిన ఛైర్మన్ నాయుడు అసలు ఈవో నన్ను అసలు పట్టించుకోవడం లేదని చెప్పారు. తనకు చైర్మన్ అనే గౌరవం కూడా చూపడం లేదని... ఏ చిన్న విషయాన్నీ తనతో చర్చించడం లేదంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసారు. దీంతో రచ్చ మొదలైంది. ఈవో ఒక్కసారిగా సంయమ నం కోల్పోయి.. 'నీకేం చెప్పడంలేదు. అన్నీ చెబుతూనే ఉన్నాం కదా' అంటూ చైర్మన్‌పై తీవ్ర స్వరంతో స్పందించారు. ఇద్దరూ 'నువ్వు' అంటే 'నువ్వు' అనుకుంటూ ఏకవచనంతోనే వాదులా డుకున్నారు. ఇంతలో మంత్రి అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకుని... ఈవోను మందలించారు.
చంద్రబాబు సీరియస్
ముఖ్యమంత్రి ముందు ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ ఈవో పై అసహనం వ్యక్తం చేసారు. ఏమైనా ఉంటే నోట్ రూపంలో ఇవ్వాలని సూచించారు. దీంతో, చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇదేనా పద్దతి.. మీ ఇద్దరు ఏం మాట్లాడుతున్నారు.. పరిధి దాటుతున్నారు.. ఎవరి మీద మీ ఫ్రస్టేషన్ అంటూ సీరియస్ అయ్యారు. జరిగినది ఏంటీ, మీరు మాట్లాడుతున్నది ఏంటీ, ముఖ్య బాధ్యతల్లో ఉన్న సమయంలో ఓపిక, సమన్వయం ఉండాలని చెప్పుకొచ్చారు. పద్దతిగా లేదని, వెంటనే ఆపాలని ఆదేశించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి వ్యవహారశైలి కూడా ప్రస్తావనకు వచ్చింది. అన్నింటిని పరిశీలిస్తాం.. నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు సీరియస్ గా స్పందించారు.












Click it and Unblock the Notifications