TTD: టీటీడీ సంచలన నిర్ణయం, శ్రీవారి ఆలయంలో మూడు రోజులు
తిరుమల శ్రీవారి లడ్డూల కల్తీ వివాదంపై దేశ వ్యాప్తంగా దూమరం కొనసాగుతున్న వేళ తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడటానికి తిరుమలలో శాంతి హోమం నిర్వహించాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనెలతో కలిపిన కల్తీ నెయ్యితో తిరుమల లడ్డుల తయారు చేశారని ల్యాబ్ నివేదికలలో వెలుగు చూడటంతో శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు.
ఈ విషయంపై దేశవ్యాప్తంగా దూమరం చెలరేగుతోంది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలోనే ఈ తతంగం మొత్తం జరగడంతో శ్రీవారి భక్తులతో పాటు సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూల తయారీ విషయంలో కల్తీ నెయ్యి ఉపయోగించారని వెలుగు చూడటంతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ఇప్పటికే టీటీడీ నుంచి నివేదిక తెప్పించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు తదుపరి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అగమ సలహాదారులు, టీటీడీ ఉన్నతాధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు వివిధ అంశాలపై చర్చించారు. లడ్డులు అపవిత్రమైనాయని వెలుగు చూసిన సందర్బంగా అగమ శాస్త్రపరంగా సూచనలు, సలహాలు ఇవ్వాలని టీటీడీ అధికారులు అగమ సలహాదారులకు మనవి చేశారు.
శ్రీవారి లడ్డూలు ఎంతో పవిత్రమైనవి కావడంతో ఆ లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారని, ఇది అపవిత్ర మని భక్తులు మండిపడుతున్న సమయంలో అగమ సలహాలు ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావు మగమ సలహాదారులకు మనవి చేశారు. శ్రీవారి లడ్డులు కల్తీ అయినందున తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు మహా శాంతియాగం నిర్వహించాలని ఈ సమావేశంలో అగమ సలహాదారులు, టీటీడీ ఉన్నతాధికారులు నిర్ణయించారని తెలిసింది.

టీటీడీ ఈవో శ్యామలరావు, వేణుగోపాల దీక్షితులు, నలుగురు ఆగమ సలహాదారులు, టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీకి చెందిన వివిధ విభాగాల అధికారులు శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వివిద అంశాలపై చర్చించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు మహా శాంతియాగం నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయంచారని తెలిసింది. మొత్తం మీద శ్రీవారి ఆలయంలో మహా శాంతియాగం నిర్వహించి తరువాత ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాలని టీటీడీ నిర్ణయించిందని తెలిసింది.












Click it and Unblock the Notifications