TTD: దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు.. నేడే అంకురార్పణ!!
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని వైయస్సార్ జిల్లా దేవుని కడపలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో నేటి నుండి ప్రారంభమవుతున్నాయి. ఫిబ్రవరి పదవ తేదీ నుండి ఫిబ్రవరి 18వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య అంకురార్పణ జరగనుంది.
ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా మొదలు కానున్నాయి ఇక ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్వామివారికి వాహన సేవలను నిర్వహించనున్నారు. పదవ తేదీన ఉదయం ధ్వజారోహణం, రాత్రి చంద్రప్రభ వాహనం పై స్వామివారు ఊరేగుతారు. 11వ తేదీన ఉదయం సూర్యప్రభవాహనం, రాత్రి, పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు.

12వ తేదీన ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి సింహ వాహనం పైన స్వామి విహరిస్తారు. 13వ తేదీన ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహన సేవలు నిర్వహిస్తారు. 14వ తేదీన ఉదయం ముత్యపుపందిరి వాహనం, రాత్రి గరుడ వాహనంపై స్వామి భక్తులను కటాక్షిస్తారు. ఇక 15వ తేదీన ఉదయం స్వామి వారి కల్యాణోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఆపై రాత్రి గజ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు.
16వ తేదీన ఉదయం రథోత్సవం నిర్వహించి, ఈరోజు రాత్రి ధూళి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 17వ తేదీన సర్వభూపాల వాహనం పైన స్వామివారి ఊరేగుతారు. రాత్రి అశ్వ వాహనంపైన దర్శనమిస్తారు. 18వ తేదీన ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రి హంస వాహనం, ధ్వజావరోహణంతో దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
ఇక ఈ బ్రహ్మోత్సవాల పూర్తి తర్వాత ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహిస్తారు. దీనికోసం భక్తులు పుష్పాలను సమర్పించవచ్చు. బ్రహ్మోత్సవాలు నిర్వహించే తొమ్మిది రోజులపాటు టీటీడీ ఆధ్వర్యంలో అనేక భక్తి , ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications