వారికి మూడు నెలలకోసారి సుపథం ద్వారా శ్రీవారి దర్శనం, సబ్సిడీ ధరకు లడ్డూలు..!!

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఈ నెలలో ఎక్కువ సెలవులు.. బ్రహ్మోత్సవాలు ఉండటంతో భక్తుల సంఖ్య పెరుగుతుందని టీటీడీ అంచనా వేస్తోంది. ఇప్పటికే బ్రహ్మెత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ జారీ అయ్యాయి. ఈ నిర్ణయం ద్వారా పలు ప్రయోజనాలు దక్కనున్నాయి.

టీటీడీలో పని చేసే కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి గుడ్ న్యూస్. వారికి స్మార్ట్ ల జారీకి సంబంధించి ఈవో ప్రొసీడింగ్స్ జారీ చేసారు. రెగ్యులర్ సబ్బంది తరహాలో క్యూ ఆర్ కోడ్ తో ఉన్న స్మార్ట్ గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. ఈ స్మార్ట్ కార్డు ద్వారా ప్రతి నెలా సబ్సిడీ ధరకే రూ.20 లకు 10 లడ్డూలు పొందవచ్చని వెల్లడించారు. అదే విధంగా ఈ ఉద్యోగులకు ప్రతి 3 నెలలకోసారి సుపథం మార్గం ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తారు. కాగా, వీరి విధులను బట్టి వేర్వేరు రంగులలో క్యూఆర్ కోడ్‌తో ఈ స్మార్ట్ కార్డులను ముద్రించి అందిస్తున్నారు. దీనిద్వారా సిబ్బందికి మరింత గుర్తింపుతో పాటు సులభంగా సేవలు అందుతాయి. కాగా.. ఇప్పటికే టీటీడీ ఉద్యోగుల సమగ్ర సమాచారం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ పరిజ్ఞానం ద్వారా స్మార్ట్ కార్డులో పొందుపరిచామని వెల్లడించారు.

భక్తుల ఇబ్బందులకు TTD చెక్, బ్రహ్మోత్సవాల వేళ ప్రారంభం- ఇక అన్నీ ఒకే చోట..!!
భక్తుల ఇబ్బందులకు TTD చెక్, బ్రహ్మోత్సవాల వేళ ప్రారంభం- ఇక అన్నీ ఒకే చోట..!!
ttd-eo-issues-proceedings-over-smart-cards-for-contract-and-out-sourcing-employees-provide-many-be

ఈ నెలలో బ్రహ్మోత్సవాలు.. విశేష పర్వదినాలు

అదే విధంగా పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా స్మార్ట్ కార్డులను అందజేశామని పేర్కొన్నారు. టీటీడీ కార్యాలయాల్లోకి ప్రవేశానికి, టీటీడీ ఆలయాల్లో దర్శనానికి, ప్రతినెలా లడ్డూలు పొందేందుకు, క్యాలెండర్, పంచాంగం పొందేందుకు, వైద్య వసతులు తదితర సౌకర్యాలు ఈ కార్డు ద్వారా పొందవచ్చని అధికారులు స్పష్టం చేశారు. ఇక.. ఈ నెలలో తిరుమలలో ప్రత్యేక పర్వి దినాలు, బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 4న శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురా ర్పణ జరగనుంది. 15న ధ్వజారోహణం తో ప్రారంభం అయ్యే బ్రహ్మోత్సవాలు.. నిత్యం వాహన సేవలతో కొనసాగి 23వ తేదీన ముగియనున్నాయి. 25వ తేదీన అనంత పద్మనాభ వ్రతం, చక్రస్నానం నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+