TTD: తిరుమల అన్నప్రసాదంలో భారీ మార్పులు, భక్తుల అభిప్రాయం ఇదే, టీటీడీ ఈవో

తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని టీటీడీ ఈవో శ్యామలరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాదాలలో అన్నం బాగా ఉడికిందా, కూరలు ఎలా ఉన్నాయని టీటీడీ ఈవో శ్యామలరావు శ్రీవారి భక్తులను అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదాలపై శ్రీవారి భక్తులు టీటీడీ ఈవో శ్యామలరావు ముందు సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కంటే చాలా రుచిగా అన్నప్రసాదం ఉందని, కడుపునిండా అన్నం తింటున్నామని భక్తులు వాళ్ల అభిప్రాయం వ్యక్తం చేశారు. తరువాత చేతులు కడుగుకునే కుళాయిలు కొన్ని పనిచేయడం లేదని, వాటిని మార్చాలని సంబంధిత అధికారులను టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు.

TTD EO Shyamala Rao made a surprise inspection at the Tirumala Anna Prasadam Centre

అంతకు ముందు తిరుమల శ్రీవారి కల్యాణ కట్టలో పరిశుభ్రత ఇంకా మెరుగుపరచాలని, తలనీలాలు సమర్పించే భక్తులకు నిరంతరాయంగా వేడి నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను టీటీడీ ఈవో జే. శ్యామలరావు ఆదేశించారు. తిరుమలలోని ప్రధాన కళ్యాణ కట్టను ఈవో శ్యామలరావు , జేఈఓ శ్రీమతి గౌతమితో కలిసి కళ్యాణకట్టలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఆకస్మకంగా పరిశీలించారు.

TTD EO Shyamala Rao made a surprise inspection at the Tirumala Anna Prasadam Centre

కళ్యాణ కట్టలో శుభ్రపరచని తల వెంట్రుకలను ఎప్పటికప్పుడు తీసివేసి ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆరోగ్యశాఖ అధికారులను టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు. బాత్ రూంలు, ఇతర హాల్స్ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచడం ద్వారా భక్తులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. కళ్యాణ కట్టలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి డీటీఎస్ ఏజెన్సీ వారు నాణ్యమైన శానిటరీ పరికరాలు, వస్తువులు ఎప్పటికప్పుడు సరఫరా చేసేటట్లు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు.

TTD EO Shyamala Rao made a surprise inspection at the Tirumala Anna Prasadam Centre

ఈ సందర్భంగా కళ్యాణ కట్టలోని అత్యంత పాత గీజర్లు, పగిలిన టైల్స్ ను గమనించి వాటిని వెంటనే మార్చాలని ఇంజనీరింగ్ అధికారులను టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశించారు. అలాగే విరిగిన నీటి కొళాయిలు, పనిచేయని ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులు స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. పెండింగ్ లో ఉన్న సివిల్, ఎలక్ట్రికల్, ఇతర ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+