TTD: శ్రీవారి తిరుమలలో ప్రత్యేక అలంకరణకు ఒక టన్ను విదేశీ కట్ ఫ్లవర్స్, విదేశీ పండ్లు !

తిరుమల/తిరుపతి: తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి సన్నిధానం ప్రతిరోజు ప్రత్యేక అలంకరణతో భక్తులను ఆకట్టుకుంటున్నది. శ్రీవారి సన్నిధి ప్రత్యేక అలంకరణకు ఒక టన్ను కట్ ఫ్లవర్స్, విదేశాల నుంచి పండ్లు
తెప్పించారు. జపాన్ నుండి యాపిల్స్, మస్కట్ నుండి ద్రాక్ష, కొరియా నుండి పియర్స్, థాయిలాండ్ నుండి మామిడి మరియు అమెరికా నుండి చెర్రీస్ కూడా స్వామివారి సేవలో తరించాయి.

 స్నపన తిరుమంజనం

స్నపన తిరుమంజనం

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం మధ్యాహ్నం రంగనాయకుల మండపంలో స్నపన తిరుమంజనం జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం రంగరంగ వైభవంగా నిర్వహించారు.

 విదేశాల్లో శ్రీవారి భక్తులు

విదేశాల్లో శ్రీవారి భక్తులు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీవారిపై ఉన్న భక్తితో వేలాది కిలోమీటర్ల లోని తమ స్వస్థలాల నుండి ఈ పండ్లు, పుష్పాలను స్వామివారికి సమర్పించారు.

శ్రీవారి వార్షిక బ్రహోత్సవాల్లో పూలు, పండ్లు ఉపయోగించాలి విదేశాలలోని శ్రీవారి భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు మనవి చేశారు.

 విదేశాల నుంచి పండ్లు, కట్ ఫ్లవర్స్

విదేశాల నుంచి పండ్లు, కట్ ఫ్లవర్స్

దేశీయ తృణధాన్యాలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాలు శ్రీవారి కైంకర్యంలో ఏ విధంగా తరిస్తున్నాయో, ఈ ఏడాది బ్రహ్మోత్సవాలలో జపాన్ నుండి యాపిల్స్, మస్కట్ నుండి ద్రాక్ష, కొరియా నుండి పియర్స్, థాయిలాండ్ నుండి మామిడి మరియు అమెరికా నుండి చెర్రీస్ కూడా స్వామివారి సేవలో తరించాయి.

 టీటీడీ గార్డెన్ విభాగం

టీటీడీ గార్డెన్ విభాగం

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని టీటీడీ గార్డెన్ విభాగం ప్రత్యేక అలంకరణలు చేసింది. ఒక్క టన్ను సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, పండ్లు, లతలతో వేదికను శోభాయమానంగా అలంకరించడమే కాకుండా శ్రీ మలయప్ప స్వామివారికి రూపొందించిన పూలమాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

 ఫస్ట్ టైమ్ ఫింగర్ మిల్లెట్ మాల, పచ్చని పవిత్రాలు, పగడపు మాలలు

ఫస్ట్ టైమ్ ఫింగర్ మిల్లెట్ మాల, పచ్చని పవిత్రాలు, పగడపు మాలలు

మొట్టమొదటిసారిగా, ఫింగర్ మిల్లెట్ (రాగులతో) చేసిన మాల, పచ్చని పవిత్రాలు మరియు పగడపు మాలలతో పాటు స్నపన తిరుమంజనంలో ఏలకులు, వట్టి వేరు, ద్రాక్ష, తులసి దండలు కూడా స్వామి అమ్మవార్లకు అలంకరించారు.

గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ ఏడాది థాయ్‌లాండ్‌కు చెందిన లిచిస్‌, ఆస్ట్రేలియన్‌ పింక్‌, బ్లాక్‌ గ్రేప్స్‌, వివిధ దేశాలకు చెందిన పండ్లను స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించినట్లు తెలిపారు.

 చెన్నై నిపుణులు

చెన్నై నిపుణులు

నాలుగు రోజుల పాటు చెన్నైకి చెందిన నైపుణ్యం గల పుష్ప కళాకారులు ప్రత్యేక అలంకరణలు చేశారు.

ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల వరకు వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ పవిత్రోత్సవంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ రమేష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+