విశాఖపట్నం వాసులకు TTD సూపర్ గుడ్ న్యూస్
తిరుమల తిరుపతి దేవస్థానం విశాఖపట్నం ప్రజలకు శుభవార్తను వినిపించింది. ఇకనుంచి రుషికొండలోని వెంకటేశ్వరస్వామివారి దేవాలయంలో
ప్రతి నెలా రెండో శనివారం లడ్డూ ప్రసాదాన్ని విక్రయించనుంది. లడ్డూలను విక్రయించేందుకు గుడిలో ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేయబోతున్నారు. రూ.50 లడ్డుతోపాటు రూ.200 లడ్డులను కూడా విక్రయిస్తారు. నగర ప్రజలకు శ్రీవారి లడ్డూలను అందించడం కోసమే ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీవారి ఆలయాల్లో భక్తుల కోసం ప్రసాదాలను అందుబాటులోకి తెస్తున్నారు. తిరుమలలో తయారైన తర్వాత రవాణా ద్వారా వాటిని ఆయా ప్రాంతాలకు తరలిస్తారు. లడ్డూలకు ఉన్న ప్రాచుర్యం దృష్ట్యా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో కూడా విక్రయించాలని టీటీడీ భావిస్తోంది. విజయవాడలో ఎప్పటినుంచో వీటిని విక్రయిస్తున్నారు. నగరంలోని టీటీడీ కల్యాణమండపంలో వీటిని అమ్ముతున్నారు. అలాగే హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో కూడా లడ్డులను అమ్ముతున్నారు.

లాక్‌డౌన్ సమయంలో తిరుమలలో భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు. దీంతో టీటీడీ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శ్రీవారి లడ్డూలను విక్రయించింది. ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్న టీటీడీ కళ్యాణ మండపాల్లో భక్తులకు సగం ధరకే వీటిని అందుబాటులోకి తెచ్చారు. రూ.50 లడ్డును రూ.25కే ఇచ్చారు. చెన్నై, బెంగళూరులో ఉన్న టీటీడీ కల్యాణ మండపాల్లో కూడా లడ్డూలను అందుబాటులో ఉంచారు. ప్రస్తుత ప్రభుత్వం విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా మార్చాలని చూస్తోంది. దసరా నుంచి ముఖ్యమంత్రి ఇక్కడే నివాసం ఉండనున్నారు. రుషికొండపై క్యాంప్ కార్యాలయంతోపాటు ముఖ్యమంత్రి ఉండేందుకు ఇంటిని నిర్మిస్తున్నారు.












Click it and Unblock the Notifications