Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

TTD: వారినెలా మరచిపోతుంది.. మార్చి 7న మహతి కళాక్షేత్రంలో ఘనంగా వేడుకలు!!

తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలోని స్వామివారి ఆలయంలో ప్రతిరోజు నిర్వహించే పూజలను, విశేష ఉత్సవాలను మాత్రమే కాదు తిరుమలలోనూ, అనుబంధ ఆలయాలలోనూ విశేష కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అత్యంత ప్రాధాన్యత ఉన్న అనేక కార్యక్రమాలను టీటీడీ ఎంతో ప్రత్యేకంగా నిర్వహించడం విశేషం. తాజాగా టిటిడి మరొక కొత్త ప్రకటన చేసింది.

త్వరలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరగనున్న క్రమంలో, తిరుపతిలో దీనిని అత్యంత ఘనంగా నిర్వహించడానికి శ్రీకారం చుట్టినట్టు పేర్కొంది. టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 7వ తేదీ గురువారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగనుంది. ఉదయం 10 గంట‌ల‌కు కార్యక్రమం ప్రారంభ‌మ‌వుతుందని టిటిడి వెల్లడించింది.

TTD international women s day celebrations in mahathi kala kshetram tirupati on march 7th

ఈ సందర్భంగా ప్ర‌ముఖ ఆధ్యాత్మిక ఉప‌న్యాస‌కురాలు శ్రీ‌మ‌తి అనంత‌ల‌క్ష్మి నందివాడ‌, ప్ర‌ముఖ గాత్ర‌సంగీత విద్వాంసురాలు శ్రీ‌మ‌తి ద్వారం ల‌క్ష్మి, మృదంగంలో మొట్ట‌మొద‌టిసారి ప‌ద్మ‌శ్రీ అవార్డు పొందిన మ‌హిళ శ్రీ‌మ‌తి సుమ‌తి నిడుమోలు, ఆసియ‌న్ గేమ్స్ కాంస్య ప‌త‌క విజేత‌, ప్ర‌ముఖ క్రీడాకారిణి కుమారి నందిని అగ‌సార త‌దిత‌రులు ముఖ్య వ‌క్తలుగా విచ్చేసి ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు.

టీటీడీలోని రెగ్యుల‌ర్‌, ఔట్సోర్సింగ్ మ‌హిళా ఉద్యోగులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. అదేవిధంగా ఈ సంవ‌త్స‌రంలో ఉద్యోగ విర‌మ‌ణ చేయ‌నున్న 60 మంది మ‌హిళా ఉద్యోగుల‌కు స‌న్మానం చేస్తారు. ఇప్పటికే అంతర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని నిన్న తిరుప‌తిలోని ఎస్వీ ఓరియంట‌ల్ క‌ళాశాల‌లో మ‌హిళా ఉద్యోగుల‌కు వ్యాస‌ర‌చ‌న‌, డ్రాయింగ్, క్విజ్ పోటీలు నిర్వ‌హించారు.

టీటీడీ సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో శ్రీమ‌తి స్నేహ‌ల‌త‌ ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి శ్రీ వెంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల మరియు శ్రీ వెంకటేశ్వర నాదస్వర, డోలు పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత, నృత్య కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.

ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై కళాశాల గాత్ర విభాగం అధ్యాపకులు శ్రీ సురేష్‌బాబు శిష్య బృందం పలు సంకీర్తనలను భావ‌యుక్తంగా ఆలపించారు. ఈ కార్యక్రమానికి వయోలిన్ పై డా. పూర్ణ వైద్య‌నాథ‌న్‌, మృదంగంపై శ్రీ శంక‌ర్ వాద్య సహకారం అందించారు.ఆపై కళాశాల వేణుగాన‌ విభాగాధిప‌తి ఎం.అనంత‌కృష్ణ వేణుగానం స‌భ‌ను ర‌క్తి క‌ట్టించింది. ఆ తరువాత కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ శ్రీమతి ప్రభావతి శిష్యబృందం భరతనాట్య ప్రదర్శన చక్కటి అభినయంతో సాగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+