TTD: బ్రహ్మోత్సవాల వేళ కీలక నిర్ణయాలు, వాహన సేవలు - భక్తులకు ఇలా..!!

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం ముస్తాబు అవుతోంది. టీటీడీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. గతం కంటే పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తోంది. దీంతో భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది. బ్రహ్మోత్సవాల వేళ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అదనపు సిబ్బందిని మోహరిస్తోంది. వాహన సేవల సమయంలో మాడ వీధుల్లో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేస్తోంది.

బ్రహ్మోత్సవాల వేళ
తిరుమలలో ఇక ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. 23వ తేదీన సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని 16వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8-10 గంటల వరకు, సాయంత్రం 7-9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి. 24న సాయంత్రం 5:43 నుంచి 6:15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహన సేవ నిర్వహించనున్నారు. 25న ఉదయం చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1:00 నుంచి 3:00 గంటల వరకు స్నపనం, రాత్రి 7:00 గంటలకు హంస వాహన సేవ ఉంటుంది.

ttd-making-arrangements-for-srivari-brahmotsavams-to-begin-on-24th-of-this-month

వాహన సేవలు
అదే విధంగా సెప్టెంబర్‌ 26న ఉదయం సింహ వాహనం, మధ్యాహ్నం ఒంటి గంటకు స్నపనం, రాత్రి 7:00 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ నిర్వహిస్తారు. 27న ఉదయం 8:00కు కల్పవృక్షం వాహన సేవ, మధ్యాహ్నం 1:00 గంటకు స్నపనం, రాత్రి 7:00 గంటలకు సర్వ భూపాల వాహన సేవ ఉంటుంది. 28న ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుంచి రాత్రి వరకు గరుడ వాహన సేవ నిర్వహిస్తారు. 29న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం 4:00 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7:00 గంటలకు గజ వాహన సేవ నిర్వహిస్తారు. 30న ఉదయం 8:00 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7:00 గంటలకు చంద్రప్రభ వాహన సేవ. అక్టోబర్‌ 1న ఉదయం రథోత్సవం, రాత్రి 7:00 గంటలకు అశ్వ వాహన సేవ ఉంటుంది. 2న ఉదయం 6:00 నుంచి 9:00 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుంచి 10:00 గంటల వరకు ధ్వజారోహణం జరగనుంది.

బ్రేక్ దర్శనాలు రద్దు
బ్రహ్మోత్సవ జరిగే రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు సైతం రద్దు కానున్నాయి. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. 27 రాత్రి 9 గంటల నుంచి 29 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి ఉండదు. బ్రహ్మోత్సవాలు జరిగే సమయాల్లో భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+