TTD: తిరుమలలో టీటీడీ అధికారులు అలర్ట్, అన్ని లక్షల మంది భక్తులు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తిరుమల కొండకు చేరుకున్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోవడానికి తిరుమల చేరుకున్నారు. ఈ రోజు గరుడ వాహన సేవ జరగనుంది. మంగళవారం సాయంత్రం గరుడ వాహన సేవ సందర్బంగా లక్షల మంది భక్తులు తిరుమల చేరుకున్నారు.

గరుడ వాహన సేవను వీక్షించేందుకు లక్షలాదిమంది శ్రీవారి భక్తులు తిరుమల చేరుకోవడంతో శ్రీవారి మాడవీధుల్లోని 230 గ్యాలరీలు నిండిపోయాయి. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి శిలాతోరణం క్యూ లైన్ లో నుంచి వెళ్లాలని, స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లోలోకి వెళ్లాలని టీటీడీ అధికారులు భక్తులకు మనవి చేశారు.

TTD officials were alerted as more than three lakh devotees reached Tirumala

గరుడోత్సవంలో భాగంగా మంగళవారం సాయంత్రం నుండి రాత్రి 11 గంటల వరకు శ్రీ మల్లప్ప స్వామి శ్రీవారి ఆలయం మాడవీధుల్లో వివరించనున్నారు. ఇప్పటికే సుమారు మూడు లక్షల మంది భక్తులు గరుడ వాహన సేవను వీక్షించేందుకు తిరుమల చేరుకున్నారు. శ్రీవారి భక్తులకు ఎప్పటికప్పుడు పాలు, మజ్జిగ, అన్న ప్రసాదాలు అందిస్తున్నారు. గరుడ వాహన సేవ సందర్భంగా తిరుమలలో శ్రీవారి భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా టీటీడీ అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గరుడ వాహన సేవను సుమారు మూడు లక్షల 50 వేల మంది భక్తులు వీక్షించడానికి అవకాశం కల్పిస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలోని మాడ వీధుల్లోని అన్ని గ్యాలరీలు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి భక్తులు నిరుత్సాహంతో కొండ దిగకుండా చూడటానికి టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రవాణా శాఖ అధికారులు తిరుమలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+