TTD: మార్చిలో శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో విశేషఉత్సవాలు; తిరుపతిలో మరో అన్నదాన కేంద్రం!!
కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడు కొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ, టిటిడి కి అనుబంధంగా ఉన్న ఇతర ఆలయాలలోను మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇదే క్రమంలో టీటీడీ మార్చి నెలలో తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో జరగనున్న విశేష ఉత్సవాలకు సంబంధించి ఒక ప్రకటన చేసింది.
మార్చి నెలలో తిరుపతిలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో 2, 9, 16, 23, 30 తేదీలలో శనివారం సందర్భంగా శ్రీ సీతారామ లక్ష్మణుల మూల మూర్తులకు ఉదయం ఆరు గంటలకు అభిషేకం నిర్వహిస్తారని పేర్కొంది. మార్చి పదవ తేదీన అమావాస్య సందర్భంగా ఉదయం ఎనిమిది గంటలకు సహస్ర కలశాభిషేకం చేపట్టి, రాత్రి 7 గంటలకు స్వామివారికి హనుమంత వాహన సేవను జరపనున్నట్లు టీటీడీ పేర్కొంది.

ఇక మార్చి 19వ తేదీన పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం జరపనున్నట్లు పేర్కొంది. ఆపై అదే రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు శ్రీ సీతారామచంద్ర మూర్తిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లి వేడుక నిర్వహిస్తారు. సాయంత్రం ఆరున్నర గంటలకు స్వామివారికి ఊంజల్ సేవను నిర్వహిస్తారు.
మార్చి 25వ తేదీన పౌర్ణమి సందర్భంగా ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు శ్రీ రామచంద్రమూర్తికి అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహిస్తారు. ఆపై సాయంత్రం ఐదున్నర గంటలకు మళ్లీ ఆలయ మాడ వీధుల నుంచి, శ్రీరామ చంద్ర పుష్కరిణి వరకు తిరుచి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆపై సాయంత్రం 6:30 గంటలకు ఆస్థానం నిర్వహిస్తారు.

ప్రతినెల తిరుమల శ్రీవారికి, శ్రీవారి అనుబంధ ఆలయాలకు విశేష ఉత్సవాలను నిర్వహించడం మాత్రమే కాకుండా, టీటీడీ భక్తుల సౌకర్యార్థం అనేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల ఆకలిని తీర్చే మరో అన్నదాన వితరణ కేంద్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న ప్రారంభించింది. ప్రపంచ నలుమూలల నుంచి తిరుపతికి వచ్చే భక్తుల కోసం నిరంతరం అన్నదాన వితరణ తిరుపతిలో కూడా జరగాలన్న ఉద్దేశంతో మరో అన్నప్రసాద కేంద్రాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చింది టీటీడీ.
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం పక్కనున్న పాత మ్యూజియం భవనంలో అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాన్ని అందిస్తున్నట్లు కరుణాకర్ రెడ్డి మీడియాకు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఙప్తి చేశారు.
-
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications