TTD: మార్చినెలలో శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు ఇవే!!

కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడు కొండలపై కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలోనూ, టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆలయాలలోనూ మార్చి నెలలో అనేక విశేష ఉత్సవాలు, పండుగలు జరగనున్నాయి. ముఖ్యంగా తిరుమలలో శ్రీవారికి మార్చి నెలలో 20 నుంచి 24వ తేదీ వరకు తెప్పోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ పేర్కొంది.

ఇక తాజాగా తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో మార్చి నెలలో పలు విశేష ఉత్సవాలు జరగనున్నాయి. ఈ వివరాలను టీటీడీ వెల్లడించింది. మార్చి 1, 8, 15, 29 తేదీలలో ముఖ్యంగా శుక్రవారం నాడు శ్రీ ఆండాళ్ అమ్మవారు సాయంత్రం 6 గంటలకు ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

TTD: These are the special festivals in Sri Govindaraja Swamy Temple in March!!

అలాగే మార్చి 8వ తేదీన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సాయంత్రం ఆరు గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తారు. మార్చి 16వ తేదీన రోహిణీ నక్షత్రాన్ని పురస్కరించుకుని రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ పార్ధసారధి స్వామివారిగా సాయంత్రం 5 గంటల 30 నిముషాల నుండి ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు.

ఇక మార్చి 25 వ తేదీన పౌర్ణమి సందర్భంగా, అంతేకాదు పంగుణి ఉత్తర ఉత్సవం సందర్భంగా రాత్రి 9 గంటల 30 నిముషాలకు ఆలయ మాడ వీధులలో గరుడ వాహనంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు అభయమిస్తారు. మార్చి నెలలో గోవిందరాజ స్వామిఆలయంలో జరగనున్న ఈ విశేష ఉత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ వేడుకలు చేసేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తుంది.

ఇదిలా ఉంటే తిరుమలలో మార్చి నెలలో మార్చి మూడవ తేదీన పల్స్ పోలియో నిర్వహించనున్నారు. మార్చి ఆరవ తేదీన సర్వ ఏకాదశిని, మార్చి 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు కన్నుల పండుగగా చేయడానికి టిటిడి నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+