TTD: రిషికేశ్ లో టీటీడీ ఆస్తులు పరిశీలించిన ఈవో జవహర్ రెడ్డి, శ్రీ స్వారూపానందస్వామీతో భేటీ !
తిరుమల/ తిరుపతి: రిషికేశ్ లోని తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్తులను టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి శనివారం పరిశీలించారు. తొలుత టీటీడీ ఈవో కెఎస్. జవహర్ రెడ్డి ఆంధ్రా ఆశ్రమంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వార్లను దర్శనం చేసుకున్నారు. అనంతరం టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి రుషికేష్ లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామి వారిని కలిశారు. ఈ సందర్బంగా స్వామీజీతో టీటీడీ ఈవో చర్చలు జరిపారు.

రిషికేశ్ లో టీటీడీ ఆస్తులు పరిశీలించిన టీటీడీ ఈవో
అనంతరం అక్కడి టీటీడీ భవనాలు, ఆస్తులను పరిశీలించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. బిగ్ గార్డెన్, చుంగి గార్డెన్ లోని టీటీడీ ఆస్తులను పరిశీలించి, వాటి పరిరక్షణకు తీసుకుంటున్నచర్యల గురించి టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు.

శ్రీ స్వరూపానందస్వామిని కలిసిన టీటీడీ ఈవో
ఈ సందర్బంగా ఎస్టేట్ విభాగం ప్రత్యేక అధికారి మల్లిఖార్జున, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరసింహమూర్తి తో పాటు స్థానిక అధికారులు ఉన్నారు.
అనంతరం టీటీడీ ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి రుషికేష్ లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న విశాఖ శారద పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామి వారిని కలిశారు.
ఈ సందర్బంటీ తిరుమల సమాచారం గురించి, అక్కడ భక్తులకు ఇటీవల అందిస్తున్న సేవల గురించి టీటీడీ ఈవో జవహర్ రెడ్డి శ్రీశ్రీశ్రీ స్వారాపానందస్వామికి వివరించారని తెలిసింది.

శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బాలాలయ కార్యక్రమాలు మూడో రోజైన శనివారం ఏకాంతంగా జరిగాయి.
ఆలయంలోని కల్యాణమండపంలో బాలాలయం ఏర్పాటుచేసి స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. యాగశాలలో ఉదయం క్రతువులు ఏకాంతంగా చేపట్టారు. సాయంత్రం కార్యక్రమాలు కూడా ఏకాంతంగా నిర్వహించనున్నారు.

ఏకాంతంగా పూజలు
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, ఆలయ ప్రధానార్చకులు పి.శ్రీనివాస దీక్షితులు, ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు, ఎఈవో ఎం.రవికుమార్‌రెడ్డి, సూపరింటెండెంట్ ఎ.నారాయణ, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ఎ.కామరాజు తదితర అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications