చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, అందుబాటులో విష్ణు నివాసం రూమ్స్, 50% ఆన్ లైన్ లో, సదా భార్గవి ఆదేశాలు !

|
Google Oneindia TeluguNews

తిరుపతి/ చిత్తూరు: వచ్చే శనివారం నుంచి శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తులకు తిరుపతిలోని విష్ణు నివాసం లో గదులు అందుబాటులోకి తేవాలని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గత కొంత కాలంగా కోవిడ్ కారణంగావిష్ణు నివాసం గదుల కేటాయింపు తాత్కాలికంగా నిలిపి వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం టీటీడీ ఈవో సదా భార్గవి విష్ణు నివాసం వసతి సముదాయం లోని గదులు, రిసెప్షన్ సెంటర్లను పరిశీలించారు. ఇంతకాలం శ్రీవారి భక్తులకు కేటాయించిన విష్ణు నివాసం గుదులను శనివారం నుంచి భక్తులకు కేటాయించాలని, అందుకు అవసరమయ్యే ఏర్పాట్లు చెయ్యాలని టీటీడీ జేఈవో సదా భార్గవి సంబంధిత అధికారులకు ఆదేశాలాలు జారీ చేశారు.

Tirupati: కోవిడ్ కేర్ సెంటర్లలో జేఈవో భార్గవి ఆకస్మిక తనిఖీలు, అవసరానికి మించి సిబ్బంది, ఆరా !Tirupati: కోవిడ్ కేర్ సెంటర్లలో జేఈవో భార్గవి ఆకస్మిక తనిఖీలు, అవసరానికి మించి సిబ్బంది, ఆరా !

కోవిడ్ దెబ్బతో బ్రేక్

కోవిడ్ దెబ్బతో బ్రేక్

తిరుపతి నగరంలో శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుల కోసం బస్ స్టాండ్ సమీపంలోని విష్ణు నివాసం గదులను టీటీడీ కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించింది. తిరుమలలో రద్దీ తగ్గించడానికి తిరుపతిలో విష్ణు నివాసం వసతి నివాసం గుదులు నిర్మించారు. గత కొంత కాలంగా కోవిడ్ వల్ల విష్ణునివాసం గదుల కేటాయింపు తాత్కాలికంగా నిలిపి వేశారు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం టీటీడీ ఈవో సదా భార్గవి విష్ణు నివాసం వసతి సముదాయం లోని గదులు, రిసెప్షన్ సెంటర్లను పరిశీలించారు.

భక్తులకు అన్ని ఏర్పాటు చెయ్యాలని ఆదేశాలు

భక్తులకు అన్ని ఏర్పాటు చెయ్యాలని ఆదేశాలు

శ్రీవారి భక్తులకు కేటాయించిన విష్ణు నివాసం గుదులను శనివారం నుంచి భక్తులకు కేటాయించాలని, అందుకు అవసరమయ్యే ఏర్పాట్లు చెయ్యాలని టీటీడీ జేఈవో సదా భార్గవి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విష్ణు నివాసంలోని అన్ని ఫ్లోర్ లను జేఈవీ సదా బార్గవి పరిశీలించి అక్కడి అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు.

లిఫ్ట్ దగ్గర పూర్తి సమాచారం ఉండాలి

లిఫ్ట్ దగ్గర పూర్తి సమాచారం ఉండాలి

ఈ సందర్భంగా టీటీడీ జేఈవో సదా భార్గవి విష్ణు నివాసం అధికారులతో మాట్లాడుతూ, ప్రతి ఫ్లోర్లో లిఫ్ట్ ఎదురుగా గదుల పూర్తి సమాచారం తెలిపే వివరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా తిరుపతిలోని, తిరుపతి పరిసర ప్రాంతాల్లోని స్థానిక ఆలయాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసే బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని టీటీడీ జేఈవో సదా భార్గవి చెప్పారు.

శ్రీవారి భక్తులకు ఇబ్బంది ఉండకూడదు

శ్రీవారి భక్తులకు ఇబ్బంది ఉండకూడదు


ఈ సమాచారం తెలియడం వల్ల శ్రీవారి భక్తులు సులభంగా స్థానిక ఆలయాలకు వెళ్ళే అవకాశం ఉంటుందని టీటీడీ జెఈవో సదా భార్గవి అధికారులకు చెప్పారు. శ్రీనివాసం నుంచి టూరిజం శాఖ స్థానిక ఆలయాలకు బస్సులు నడుపుతున్న విషయం తెలిసిందే. శ్రీనివాసం నుంచి శ్రీవారి భక్తులు స్థానిక ఆలయాలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసుకోవడానికి అవకావం ఉంది.

ఆన్ లైన్ లో 50 శాతం గదులు

ఆన్ లైన్ లో 50 శాతం గదులు

విష్ణు నివాసంలో 50 శాతం గదులు భక్తులకు ఆన్ లైన్ ద్వారా కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ జెఈవో సదా భార్గవి ఐటి అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విష్ణు నివాసం చుట్టూ మొక్కలు నాటి, ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటయ్యేలా చూడాలని టీటీడీ జెఈవో సదా భార్గవి అధికారులకు సూచించారు.

 రైల్వే స్టేషన్ వెనుక సత్రాలు పరిశీలించిన సదా భార్గవి

రైల్వే స్టేషన్ వెనుక సత్రాలు పరిశీలించిన సదా భార్గవి

అనంతరం టీటీడీ జెఈవో సదా భార్గవి అక్కడి రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడుతూ, శనివారం నుంచి గదులు కేటాయించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అనంతరం రైల్వే స్టేషన్ వెనుక ఉన్న 2, 3 సత్రాలను టీటీడీ జెఈవో సదా భార్గవి పరిశీలించారు. కోవిడ్ కారణంగా ఈ సత్రాలు భక్తులకు తాత్కాలికంగా కేటాయించనందువల్ల చిన్నపాటి మరమ్మతులకు గురికావడం, పిచ్చి మొక్కలు పెరిగి ఉండటం టీటీడీ జెఈవో సదా భార్గవి గమనించారు.

Recommended Video

Cricket Australia Warns Talibans.. మ‌హిళ‌ల‌ను ఆడనిస్తేనే మీతో సిరీస్ || Oneindia Telugu
పనులు పూర్తి చెయ్యండి

పనులు పూర్తి చెయ్యండి

గదుల మరమ్మతులు త్వరగా చేయించి పిచ్చి మొక్కలు తొలగించి ఈ ప్రాంతాన్ని సుందరంగా తయారుచేయాలని టీటీడీ జెఈవో సదా భార్గవి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతానికి మూడవ సత్రంలోని గదులు భక్తులకు అందుబాటులోకి తేవాలని, ఈ లోపు రెండవ సత్రంలో మరమ్మతులకు గురైన గదుల పనులు పూర్తి చేయించాలని టీటీడీ జెఈవో సదా భార్గవి ఆదేశించారు. ఈ సందర్బంగా టీటీడీ జెఈవో సదా భార్గవి వెంట
ఈఈ లు కృష్ణా రెడ్డి, శ్రీమతి సుమతి, డిప్యూటీ ఈ ఈ జోగయ్య, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కుసుమ,
విష్ణు నివాసం ఏ ఈ ఓ శ్రీమతి సీతామహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

English summary
TTD: Tirupati Vishnu Nivasam Rooms availability Tirumala devotees. 50% of the rooms will be released online.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X