తిరుమలలో అంగప్రదక్షిణం చేయాలనుకొనే భక్తులకు గుడ్ న్యూస్..!!

శ్రీవారి సన్నిధిలో అంగప్రదక్షిణం చేయాలనుకొనే భక్తుల కోసం టీటీడీ టోకెన్లు జారీ చేయనుంది. భక్తుల కోసం టీటీడీ కీలక ప్రకటన చేసింది.

Tirumala: తిరుమలలో అంగప్రదక్షిణం చేయాలనుకుంటున్న భక్తుల కోసం టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారి పలు సేవలను వీక్షించాలి..తమ మొక్కులు చెల్లించుకోవాలని నిరీక్షిస్తూ ఉంటారు. అంటువంటి వారిలో పలువురు అంగప్రదక్షిణం చేయాలనుకొనే వారూ ఉంటారు. అయితే, తిరుమలలో అంగప్రదక్షిణం చేసే వారు ముందుగా టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. తిరుమల సంప్రదాయాలను అనుసరిస్తూ అంగప్రదక్షిణం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు టీటీడీ మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం అందుబాటులోకి తీసుకొస్తోంది.

శ్రీవారి సన్నిధిలో అంగప్రదక్షిణం చేయాలనుకొనే భక్తుల కోసం టీటీడీ టోకెన్లు జారీ చేయనుంది. మార్చి నెల 23వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అంగప్రదక్షిణం కోసం రేపు (శనివారం) 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో టోకెన్లు జారీ చేయనున్నారు. కావాల్సిన భక్తులు ఈ టోకెన్లు పొందే అవకాశం ఉందని ప్రకటించారు. అంగప్రదక్షిణం చేయాలనుకొనే భక్తులు టోకెన్లు ఉంటే వారిని ప్రత్యేకంగా ఎంట్రీ సమయం టీటీడీ నిర్ణయిస్తుంది. అంగప్రదక్షిణం చేసే వారు తిరుమలలో నిర్ణయించిన విధంగా సంప్రాదాయాలను పాటించాల్సి ఉంటుంది. శ్రీవారి పుష్కరిణిలో మునకలు వేసిన తరువాత ముందుగా టోకెన్ మీద నిర్ణయించిన ఎంట్రీ ద్వారం వద్దకు వెళ్లారు. స్వామి వారి సుప్రభాత సేవ ప్రారంభమైన తరువాత ముందుగా స్త్రీలను అనుమతిస్తారు. వారి ప్రదక్షణ పూర్తి చేసిన తరువాత పురుష భక్తులను అనుమతిస్తారు.

TTD to release Angapradikshnam tokens for the period of March 23rd to 31st on 11th February

స్వామి వారి బంగారు వాకిలి ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేస్తూ.. అలాగే శ్రీవారి ప్రాకారం చూట్టూ ప్రదక్షిణ చేస్తూ శ్రీవారి హుండీ వరకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇక..టీటీడీలో వచ్చే వేసవి రద్దీ అంచనాలకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక..తాజాగా టీటీడీ ఆవిష్కరించిన యాప్ కు భక్తుల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు చెబుతున్నారు. తిరుమలలో కొత్తగా పరాకమణి భవనం అందుబాటులోకి వచ్చింది. దాదాపు రెండు వందల మంది సిబ్బంది ఒకే సారి శ్రీవారి హుండీ లెక్కింపుకు వీలుగా ఈ నిర్మాణం పూర్తి చేసి..అందులోనే పరాకమణి ప్రారంభించారు. భక్తులు సైతం పరాకమణిలో హుండీ లెక్కింపు వీక్షించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+