సీఎం జగన్ కు రుణాలు పుట్టే ఛాన్స్ లేదు - పంచలేరు : ఇక ప్రతిపక్షమే - మాజీ సీఎస్ సంచలనం..!!
ముఖ్యమంత్రి తమ ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమం గురించి ప్రజల్లోకి వెళ్లి చెప్పాలని పార్టీ నేతలను ఆదేశించారు. ప్రతీ కుటుంబానికి సంక్షేమ పథకాలు అందున్నాయని..వారికి ఏవి అందిస్తున్నామో ఇంటింటికీ వెళ్లి వివరించాలని పార్టీ నేతలకు సూచించారు. ఇంత సంక్షేమం చేసినప్పుడు 175 సీట్లు ఎందుకు గెలవకూడదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు అనేక సంక్షేమ పథకాల కింద..ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ 1.37 లక్షల కోట్లు అందించినట్లు చెబుతూ వచ్చారు. రానున్న రెండేళ్లు కొనసాగుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఆర్దిక సమస్యలు..కరోనా కారణంగా ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాల అమలు ఆపటం లేదని పదే పదే చెబుతున్నారు. ఇదే సమయంలో ఏపీకి రుణాలు రాకుండా.. పేదలకు సంక్షేమం వద్దనే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయంటూ ప్రత్యర్ది పార్టీల పైన ఫైర్ అవుతున్నారు. ఇక, ఈ సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు ఇదే అంశం పైన వరుసగా ట్వీట్లు చేసారు. ఆయన సీఎస్ గా పదవీ విరమణ చేసిన తరువాత టీడీపీ హయాంలో నామినేటెడ్ పదవిలో కొనసాగారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీలోనూ క్రియాశీలకంగా లేరు.

అయితే, ఆయన చేసిన తాజా ట్వీట్ లో.. ఇప్పటికే 1.37 వేల కోట్లు పంచాం. ఇంకొక లక్ష కోట్లు పంచటానికి సిద్ధంగా ఉన్నాం. 175 కు175 రావాలి. ఇది ముఖ్యమంత్రి గారి నమ్మకం. అంటే ఓటు బ్యాంకు ఏర్పాటు చేసుకోవడానికి నియోజకవర్గానికి 1342 కోట్లు కేటాయించినట్లు... అంటూ పేర్కొన్నారు. దీనికి కొనసాగింపుగా ..ఇంతవరకూ ఏ అప్పోసప్పో తెచ్చి 1.37 లక్షల కోట్లు పంచిన ఇంకా పంచాలి అనుకుంటున్న లక్ష కోట్లు వచ్చే అవకాశమే లేదు.
ఇంతవరకూ ఏ అప్పోసప్పో తెచ్చి 1.37 లక్షల కోట్లు పంచిన ఇంకా పంచాలి అనుకుంటున్న లక్ష కోట్లు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే రుణాలు పుట్టే మార్గాలన్నీ మూసుకునే పోయాయి.
— IYRKRao , Retd IAS (@IYRKRao) April 28, 2022
మీరు తిరిగి అధికారంలోకి వచ్చిన ఈ పంపకం సాధ్యం కాదు అనేది ప్రజలు ఇప్పటికే గ్రహించారు.
వీటన్నిటి ప్రభావం 2024 ఎన్నికలపై పడుతుంది కనుక ప్రతిపక్ష స్థానమే బహుమతిగా లభిస్తుంది.
— IYRKRao , Retd IAS (@IYRKRao) April 28, 2022
ఎందుకంటే రుణాలు పుట్టే మార్గాలన్నీ మూసుకునే పోయాయి.. మీరు తిరిగి అధికారంలోకి వచ్చిన ఈ పంపకం సాధ్యం కాదు అనేది ప్రజలు ఇప్పటికే గ్రహించారు...అంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇక, వీటన్నిటి ప్రభావం 2024 ఎన్నికలపై పడుతుంది కనుక ప్రతిపక్ష స్థానమే బహుమతిగా లభిస్తుందంటూ ఐవైఆర్ చేసిన ట్వీట్లు ఇప్పుడు రాజకీయంగా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ట్వీట్ల పైన వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి.












Click it and Unblock the Notifications