• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ మద్దతిస్తేనే- పట్టు బిగిస్తారా : రాష్ట్రపతి ఎన్నికల్లో కొత్త ట్విస్ట్ : కాదంటే బీజేపీ రూటు అటే...!!

|
Google Oneindia TeluguNews

ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో వైసీపీ పైన చర్చ మొదలైంది. ఎన్డీఏకు జగన్ అవసరం ఏర్పడింది. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ కేంద్రంగా వ్యూహాలు మారుతున్నాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత కాంగ్రెస్ అలర్ట్ అయింది. ప్రాంతీయ పార్టీల మద్దతుతో మోదీని వచ్చే ఎన్నికల్లో గద్దె దించాలని వ్యూహాలు సిద్దం చేస్తోంది. అందులో ముందుగా రాష్ట్రపతి ఎన్నిక నుంచే సత్తా చాటాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అయితే, ప్రస్తుతం ఎన్డీఏ ఆధిక్యత లో ఉన్నా.. తమ సొంత బలంతో రాష్ట్రపతి అభ్యర్ధిని గెలిపించుకొనే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు అనివార్యంగా మారుతోంది. కాంగ్రెస్.. తటస్థ పార్టీలు కలిస్తే విజయం వారిదే. దీంతో..ఇప్పుడు వైసీపీ పాత్ర పైన జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది.

గతంలో టీడీపీ దెబ్బ తీసేందుకు

గతంలో టీడీపీ దెబ్బ తీసేందుకు


2017 ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఎలక్టోరల్‌ కాలేజీలో 65.65% ఓట్లు దక్కించుకొని ఘన విజయం సాధించారు. ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్‌ 34.35% ఓట్లకు పరిమితమయ్యారు. కానీ ఈసారి లెక్కలు మారాయి. ప్రస్తుతం ఎన్డీఏ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మిత్రపక్షాలు దూరం అయ్యాయి. రాష్ట్రపతిని ఎన్నుకొనే ఎలక్టోరల్‌ కాలేజీలో ఎన్డీయే ఓట్ల విలువ 48.9%గా ఉండగా... విపక్షాల మొత్తం బలం 51.1% గా ఉంది. రాష్ట్రపతి ఎన్నికలు జులైలో జరగనున్నాయి. ఆ లోపు 52 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. వాటి ఫలితాలు ఎలక్టోరల్‌ కాలేజీలో బలాబలాలపై ప్రభావం చూపుతాయి. వైసీపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఎన్నిక కానున్నారు. రాజ్యసభ ఎన్నికలు జరిగే రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, తమిళనాడుల్లో కాంగ్రెస్..మద్దతు పార్టీలు అధికారం లో ఉన్నాయి.

బీజేపీ ఆ ఇద్దరిలో ఒకరి మద్దతు కీలకం

బీజేపీ ఆ ఇద్దరిలో ఒకరి మద్దతు కీలకం

దీంతో..అక్కడ కొత్తగా బీజేపీకి బలం పెరిగే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేక..తటస్థ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నిక అంశం పైన వైసీపీ అధినేత..ఏపీ సీఎం జగన్ తో చర్చలు చేసారని చెబుతున్నారు. 2017 ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధులకు బేషరతుగా మద్దతిచ్చిన జగన్..ఈ సారి ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. 2017 లో జగన్ ప్రతిపక్షంలో ఉండటంతో..టీడీపీని దెబ్బ తీసేందుకు ఎన్డీఏ అభ్యర్దికి మద్దతిచ్చారు. ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్ కు ఏపీలో పాలనా పరంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. వాటికి కేంద్రం నుంచి తోడ్పాటు కోరుకుంటున్నారు. రాజకీయంగానూ కొన్ని అంశల పైన స్పష్టత కోరుతున్నారు. వాటి పైన సానుకూలత వస్తేనే జగన్ రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వటానికి సిద్దంగా ఉన్నారని చెబుతున్నారు.

సీఎం జగన్ పట్టు బిగిస్తారా..అంగీకరిస్తారా

సీఎం జగన్ పట్టు బిగిస్తారా..అంగీకరిస్తారా

ప్రస్తుత పరిస్థితుల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఎన్డీయేకు మరో 11,990 పాయింట్లు అవసరం. అయితే, గతంలో మద్దతిచ్చిన తటస్థ పార్టీల్లో ఇప్పుడు టీఆర్ఎస్ దూరమైంది. మిగిలింది ఇక వైసీపీ..బీజేడీ. కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ఇక ఎన్డీఏకు మద్దతిచ్చే అవకాశాలు లేవు. జగన్ - నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని వైసీపీ - బిజూ జనతాదళ్ రెండు పార్టీల వైపు బీజేపీ నేతలు చూస్తున్నారు. ఈ రెండు పార్టీల్లో ఏ ఒక్క పార్టీ మద్దతు ఇచ్చినా..ఎన్డీఏ అభ్యర్ధి రాష్ట్రపతి అవుతారు. ఇద్దరూ ఇప్పటి వరకు ఎన్డీఏతో కలవకపోయినా..అవసరమైన సమయంలో మద్దతు ఇస్తూనే ఉన్నారు. తాజా పరిస్థితుల్లో ముందుగా బీజేపీ అధినాయకత్వం ..ఈ అంశంలో జగన్ తోనే చర్చలు చేసిందని సమాచారం. అయితే, జగన్ సైతం తాను మద్దతుగా నిలుస్తున్నా..ఆ స్థాయిలో కేంద్రం నుంచి సహకారం ఉండటం లేదనే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.

వైసీపీ కాదంటే బీజేపీ రూట్ క్లియర్

వైసీపీ కాదంటే బీజేపీ రూట్ క్లియర్

అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ మద్దతు ఇస్తారని..కేంద్రంతో దూరం అయ్యేందుకు జగన్ సిద్దంగా లేరనేది పార్టీ ముఖ్య నేతల వాదన. సీఎం జగన్ కోరుతున్న కొన్ని అంశాల్లో కేంద్రం నుంచి సహకారం లభిస్తుందనే ఆశాభావం సైతం వారు వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఈ ఎన్నికల్లో మద్దతు ఇవ్వటానికి సిద్దంగా లేకుంటే..ఏ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవటానికి టీడీపీ అధినేత చంద్రబాబు సిద్దంగా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బలం తక్కువగా ఉన్నా..చంద్రబాబు మద్దతు ఎవరి వైపు ఉంటుందనేది మరో ఆసక్తి కర అంశం. దీంతో..బీజేపీకి వైసీపీ అధినేత జగన్ కాదంటే నవీన్ పట్నాయక్ మద్దతిచ్చ అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో.. జగన్ 2024 వ్యూహాల్లో భాగంగా ..టీడీపీని ఫిక్స్ చేయాలంటే..ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ఇస్తారనేది విశ్లేషకుల అంచనా. దీంతో..రాష్ట్రపతి ఎన్నికలు..ఇటు ఏపీ రాజకీయాల్లోనూ ఆసక్తి కరంగా మారుతున్నాయి.

English summary
New twist in President elections as YSRCP will become key for NDA supporting candidate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X