వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో ట్విస్టు : జగన్ కొత్త లెక్కలతో లిస్టులో మార్పులు : ఆ ఇద్దరు - రెండు జిల్లాలు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

వైసీపీ లో ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక పైనే అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక, 2024 ఎన్నికలకు ముందు ఇంత పెద్ద స్థాయిలో ఎమ్మెల్సీల భర్తీకి అవకాశం లేకపోవటంతో ఈ సారే ఛాన్స్ దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాలు.. స్థానిక సంస్థల కోటాలో 11 స్థానాల భర్తీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అందులో ఎమ్మెల్యే కోటాలో మూడు స్థానాలకు అభ్యర్ధులను అధికారికంగా ప్రకటించారు.

సమీకరణాలో కీలకంగా ఎంపిక

సమీకరణాలో కీలకంగా ఎంపిక


అందులో రాయలసీమ నుంచి ఒక రెడ్డి..మైనార్టీ వర్గానికి , అదే విధంగా ఉత్తరాంధ్ర నుంచి బీసీ వర్గానికి అవకాశం ఇచ్చారు. కడప జిల్లాకు చెందిన డీసీ గోవిందరెడ్డి, కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఇషాక్, విజయనగరం జిల్లాకు చెందిన పాలవలస విక్రాంత్ ను ఖరారు చేసారు. ఇక, స్థానిక సంస్థల కోటాలో భర్తీ చేయాల్సిన 11 స్థానాల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. కానీ, సామాజిక సమీకరణాల్లో భాగంగా ఇద్దరి పేర్లు - రెండు జిల్లాల ఈక్వేషన్స్ పైన ఇప్పుడు తుది కసరత్తు జరుగుతోంది. స్థానిక సంస్థల కోటాలో పదకొండు మందిపైన దాదాపు ఒక అంచనాకు వచ్చారు.

11 స్థానాల ఎంపిక పైనా కసరత్తు

11 స్థానాల ఎంపిక పైనా కసరత్తు

అందులో విజయనగరం నుంచి ఇందుకూరు రఘురాజు పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లా నుంచి వంశీక్రిష్ణ యాదవ్ తో పాటుగా వరుదు కళ్యాణి పేర్లు రెండు స్థానాలకు ఖరారు చేసినట్లుగా సమాచారం. ఇక, తూర్పు గోదావరి నుంచి అనంత ఉదయభాస్కర్ పేరు ఖాయమని చెబుతున్నారు. ఇక, క్రిష్ణా జిల్లా నుంచి రెండు స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. ఈ జిల్లా నుంచి తొలి నుంచి జగన్ కు మద్దతుగా ఉంటూ..ప్రస్తుతం ఆయన కార్యక్రమాల నిర్వహణా సలహాదారుగా ఉన్న తలశిల రఘురాం పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

సలహాదారు రఘురాంకు ఖాయంగా

సలహాదారు రఘురాంకు ఖాయంగా

ఆయన పాదయాత్ర సమయంలోనూ పూర్తిగా జగన్ తోనే ఉంటూ..పాదయాత్ర షెడ్యూల్... ఏర్పాట్లు..సభలు..సమావేశాల నిర్వహణ పైన అన్నీ తానై బాధ్యతలు తీసుకున్నారు. దీంతో..పాటు టీడీపీకి మద్దతుగా నిలిచే కమ్మ వర్గం నుంచి ఈ సారి ఇద్దరికి ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. రఘురాం తో పాటుగా అదే జిల్లాకు చెందిన బీసీ వర్గానికి మరో సీటు కేటాయించనున్నారు. మచిలీపట్నంకు చెందిన మత్య్సాకార నేతకు ఎమ్మెల్సీ పదవి దక్కనుందని తెలుస్తోంది. ఇక, గుంటూరు జిల్లా నుంచి కాపు వర్గానికి చెందిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు..కమ్మ వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ పేర్లు ఖాయమని చెబుతున్నారు.

మర్రికి ఛాన్స్ ఉన్నట్లా లేనట్లా

మర్రికి ఛాన్స్ ఉన్నట్లా లేనట్లా


కానీ, అక్కడ మర్రి రాజశేఖర్ పేరుతో మరో చిక్కుముడి ఉంది. 2019 ఎన్నికలు పూర్తయిన సమయం నుంచి ఎమ్మెల్సీల నియామకంలో ప్రతీసారి మర్రి రాజశేఖర్ పేరు రేసులో ఉండటం....చివర్లో మిస్సవటం జరుగుతోంది. అయితే, ఈ సారి ప్రకాశం జిల్లా నుంచి తూమాటి మాధవరావు పేరు పరిశీలనలో ఉంది. ఆయనకు ఇవ్వాలంటే మర్రి రాజశేఖర్ కు మరోసారి వాయిదా వేయాల్సి ఉంటుంది. వరుసగా మూడు జిల్లాల నుంచి కమ్మ సామాజిక వర్గానికే మూడు సీట్లు ఇస్తే సమీకరణా లు దెబ్బ తినే అవకాశం ఉంది. దీంతో.. మర్రికి ఇవ్వాలంటే ప్రకాశం నుంచి మాధవరావు స్థానంలో ఎస్సీ వర్గ నేతకు ఇవ్వాల్సి ఉంటుంది.

గుంటూరు - ప్రకాశం సమీకరణాలకు లింకు

గుంటూరు - ప్రకాశం సమీకరణాలకు లింకు


తూమాటికే ఖాయం చేస్తే గుంటూరు జిల్లా నుంచి బీసీ లేదా ఎస్సీ వర్గానికి ఆ సీటు కేటాయించాల్సి ఉంటుంది .అయితే, మర్రికి చాలా కాలంగా పెండింగ్ లో ఉండటంతో తూమాటికి మరోసారి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి ఈ సారి కమ్మ వర్గానికి రెండు సీట్లు ఖాయం చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక, చిత్తూరు నుంచి కుప్పం ఇన్ ఛార్జ్ భరత్ పేరు ఖాయమైంది. అదే విధంగా అనంతపురం నుంచి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డితో పాటుగా గతంలో విప్ గా పని చేసిన శివరామి రెడ్డి పోటీ పడుతున్నారు.

ఈ రోజే రేపు అధికారిక ప్రకటన

ఈ రోజే రేపు అధికారిక ప్రకటన

వీరిద్దరిలో సీఎం చివరికి ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది తేలాల్సి ఉంది. ఈ ఇద్దరిలో ఒకరికి ఎమ్మెల్సీ పదవి.. మరొకరికి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలు కేటాయించనున్నారు. ముఖ్యమంత్రి ప్రకాశం ..గుంటూరు జిల్లాల సమీకరణాలు ఒక కొలిక్కి రాగానే.. ఈ 11 మంది జాబితాను వైసీపీ అధికారికంగా ప్రకటించనుంది. శనివారం పేర్లు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో...ఆశావాహులు తమ చివరి ప్రయత్నాలను ముమ్మరం చేసారు.

English summary
A twist had taken place in the final list of MLCs where Kamma community is given priority if news is to be believed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X