మరో విషాదం: కృష్ణా నదిలో పడవ బోల్తా, ఇద్దరు మృతి!

విజయవాడ: పోలవరం లాంచీ ప్రమాద ఘటన మరిచిపోకముందే ఏపీలో మరో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఒక మత్స్యకారుడి పడవను మరో బోటు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు నదిలో గల్లంతయ్యారు.

ప్రమాదానికి గురైన బోటు ఇబ్రహీంపట్నానికి చెందిన మత్స్యకారుడు సైదారాజుదిగా గుర్తించారు. చేపలు పట్టేందుకు నది వద్దకు వెళ్లిన సైదారాజు.. భార్య మాధవి(26), కూతురు కావ్య(6)లను కూడా వెంట తీసుకెళ్లాడు. శనివారం తెల్లవారుజామున చేపలు పట్టేందుకని శుక్రవారం రాత్రే అక్కడికి వెళ్లారు.

two dead as boat capsizes in krishna river andhrapradesh

రాత్రి ముగ్గురు నది ఒడ్డునే పడవలో పడుకున్నారు. శనివారం తెల్లవారుజామున ఇసుక తవ్వకానికి వచ్చిన ఓ డ్రెజ్జర్ బోటు వీరి పడవను బలంగా ఢీ కొట్టింది. దీంతో పడవ బోల్తా పడి సైదారాజు భార్య, కూతురు నది ప్రవాహంలో గల్లంతయ్యారు. సైదారాజు మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు.

గాఢ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం జరగడంతో మాధవి, కావ్యలు నీట మునిగినట్టు తెలుస్తోంది. జాతీయ విపత్తు నివారణ దళం (ఎన్‌డీఆర్ఎఫ్) వీరి మృత‌దేహాలను వెలికితీయడంతో పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+