విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ప్రజలకు శుభవార్త చెప్పిన కేంద్రం
ఏపీ, తెలంగాణ మీదుగా రాకపోకలు సాగిస్తున్న భువనేశ్వర్-ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా రెండు జనరల్ బోగీలు ఏర్పాటు చేస్తున్నారు. జనరల్ బోగీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముంబయి నుంచి బయలుదేరే కోణార్క్ 11019 రైలుకు నవంబరు 17వ తేదీ నుంచి, భువనేశ్వర్ నుంచి బయలుదేరే 11020 కోణార్క్ రైలుకు నవంబరు 15వ తేదీ నుంచి ఈ రెండు బోగీలు అందుబాటులోకి వస్తాయి. వీటితోపాటు ఏడు స్లీపర్ బోగీలు, ఆరు థర్డ్ ఏసీ బోగీలు, నాలుగు జనరల్ బోగీలు, రెండు సెకండ్ ఏసీ, ఒక మోటారుకారు బోగీ, ఒక ప్యాంట్రీకార్, సెకండ్ సిట్టింగ్ తో కలిపి ఒక దివ్యాంగుల బోగీ ఉంటుంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటతో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల మధ్య తిరుగుతున్న ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లకు అదనంగా రెండు జనరల్ బోగీలను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల రద్దీ లేకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా సాఫీగా ప్రయాణం సాగుతుందని అధికారులు చెబుతున్నారు.
5రోజులు దారి మళ్లింపు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ట్రాఫిక్ మరమ్మతు పనులు జరుగుతుండటంతో దాదాపుగా అన్ని డివిజన్లలో కొన్ని రైళ్లు రద్దవుతున్నాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. ఈ క్రమంలోనే భావనగర్ నుంచి కాకినాడ పోర్ట్ వరకు నడుస్తున్న 12756 రైలును దారి మళ్లించారు. వచ్చే నెల 3, 10, 17, 24, 31 తేదీల్లో మొత్తం ఐదురోజులపాటు ఈ దారి మళ్లింపు ఉంటుంది. ప్రస్తుతం ఈ రైలు సామర్లకోట, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ మీదుగా నడుస్తుంది. పైన పేర్కొన్న ఐదు రోజుల్లో మాత్రం గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు మీదగా నడుపుతున్నారు.

అన్ రిజర్వుడు రైలు
చెన్నై సెంట్రల్ నుంచి సంత్రాగచ్చి వరకు అన్ రిజర్వుడు ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ఈనెల 25వ తేదీ రాత్రి 11.45 గంటలకు చెన్నైలో బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం 1.54 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి సంత్రాగచ్చికి 1.59 గంటలకు బయలుదేరుతుంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని వాల్తేర్ డివిజన్ అధికారులు కోరారు.












Click it and Unblock the Notifications