జగన్‌కి షాక్: టిడిపిలోకి ఇద్దరు ఎంపీలు, బుజ్జగింపులు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్! ఇటీవల జగన్ పార్టీ నుండి పార్లమెంటు సభ్యులుగా గెలుపొందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. వారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో టచ్‌లో ఉన్నారట. వారి దారిలోనే మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున కర్నూలు, నంద్యాల లోకసభల నుండి ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుకలు పోటీ చేసి గెలుపొందారు. అయితే పలు కారణాలతో వారు జగన్ నుండి దూరం వెళ్లాలనుకుంటున్నారట.

తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చినందున మరో ఐదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, అలాగే కేంద్రంలో ఎన్డీయే కూటమిలో టిడిపి ఉందని, దానికి తోడు వైయస్ జగన్ కేసులలో ఇరుక్కోవడంతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని, ఈ కారణంగానే బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డిలు టిడిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వారు న్యూఢిల్లీలో చంద్రబాబుతో ఆదివారం మధ్యాహ్నం కలిసే అవకాశాలు ఉన్నాయి.
బుజ్జగింపులకు రంగంలోకి సీనియర్లు
బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డిలు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారనే ఊహాగానాల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్లు వారిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. సాయంత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications