చంద్రబాబుకు జైట్లీ ఇచ్చిన హామి ఏంటీ?: టీడీపీపై ఒత్తిడి పెంచిన కాంగ్రెస్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ప్రత్యేకహోదా కోరుతూ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ఏపీలో కాంగ్రెస్ పార్టీకి కాస్తంత జీవం పోసేలా కనిపిస్తోంది. కేవీపీ బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని ఆయా రాజకీయ పార్టీలు అనుకూలంగా మలచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీకి అందివచ్చినట్లుగా కనిపిస్తోంది. ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన నేతలు రోడ్లు ఊడ్చి వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. మరికొందరు నేతలు ఏపీకి ప్రత్యేకహోదా సాధించడంలో టీడీపీ విఫలమైందంటూ అధినేత, సీఎం చంద్రబాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు.

అటు వైసీపీ, ఇటు కాంగ్రెస్ నేతల మాటల యుద్ధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సతమతమవుతున్నారు. తాజాగా బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నిప్పులు చెరిగారు. అరటాకు ముల్లు కథ ఆంతర్యమేమిటో చెప్పాలని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు.

ఢిల్లీలో ఈరోజు ఉదయం మీడియాతో ఉండవల్లి మాట్లాడుతూ అరిటాకు ముల్లు కథలో... బీజేపీ ముల్లు అయితే, అరిటాకు ఏపీ కాబోదని, ఆ ఆకు చంద్రబాబే అవుతారని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు పోరాడతారో, ద్రోహం చేసి చరిత్రలో నిలిచిపోతారో తేల్చుకోవాలని ఉండవల్లి సవాల్ విసిరారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ విభజనకు అందరూ ఒప్పుకోబట్టే కాంగ్రెస్ పార్టీ విభజన చేసిందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామని చెబితే కాదు పదేళ్లు ఇవ్వాలంటూ బీజేపీ పట్టుబట్టిందని అలాంటిది ఇప్పుడు బీజేపీ ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆయన నిలదీశారు.

 చంద్రబాబు సమన్యాయంపై ఉండవల్లి మండిపాటు

చంద్రబాబు సమన్యాయంపై ఉండవల్లి మండిపాటు

తామేమీ ఏపీకి శాశ్వతంగా ప్రత్యేకహోదా అడగడం లేదని చెప్పిన ఉండవల్లి రాజ్యసభ సాక్షిగా ఏపీకి పదేళ్లు మాత్రమే హోదాను అడుగుతున్నామని అన్నారు. రెవెన్యూ లోటు విషయంలో కూడా కేంద్రం ఏపీకి అన్యాయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. రోజుకో పదిపైసలు చొప్పున ఇస్తామంటూ ఎగతాళిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు సమన్యాయంపై ఉండవల్లి మండిపాటు

చంద్రబాబు సమన్యాయంపై ఉండవల్లి మండిపాటు

విభజన సమయంలో ఏపీకి తొలి బడ్జెట్‌లోనే నిధులు ఇవ్వాలని, వాటిని ఏవిధంగా ఇవ్వాలో కూడా అప్పటి ప్రధాని మన్మోహాన్ సింగ్ రాజ్యసభలో ప్రస్తావించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సీమాంధ్రకు చెందిన ఎంపీలు విభజన బిల్లుకు మద్దతు తెలపలేదని, కేవలం బీజేపీ సహకరించబట్టే విభజన జరిగిందని ఆయన గుర్తు చేశారు.

 చంద్రబాబు సమన్యాయంపై ఉండవల్లి మండిపాటు

చంద్రబాబు సమన్యాయంపై ఉండవల్లి మండిపాటు

విభజన జరిగి రెండేళ్లు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ఏడాది రెవెన్యూ లోటును ఇప్పటికీ పూడ్చలేదని ఆయన తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ విభజన సమయంలో చంద్రబాబు సమన్యాయం అంటూ మాట్లాడారని, ఆ సమ న్యాయం అంటే ఏంటో ఇప్పటికైనా చెప్పాలని ఆయన నిలదీశారు.

 చంద్రబాబు సమన్యాయంపై ఉండవల్లి మండిపాటు

చంద్రబాబు సమన్యాయంపై ఉండవల్లి మండిపాటు

అసలు ఆ బ్రహ్మాపదార్ధంలో ఏముందో ఇప్పటికైనా ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని ఆయన నిలదీశారు. ఏపీకి హోదా విషయంలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏం హామీ ఇచ్చారో అర్ధం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Undavalli arun kumar fires on chandrababu naidu over common justice.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి