'ఓటుకు నోటు'లో తప్పేం లేదు, బాబు ధైర్యం చేస్తే మోడీ ప్రభుత్వం ఔట్: ఉండవల్లి సంచలనం
Recommended Video

అమరావతి: ఇరవై ఏళ్ల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావును గద్దె దింపినప్పుడు వైస్రాయ్ హోటల్ వేదికగా రాజకీయాలు నడిపిన చంద్రబాబు, అలాంటి ధైర్యంలో ఇప్పుడు పదోవంతు చూపినా నరేంద్ర మోడీ ప్రభుత్వం పడిపోతుందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఓ టీవీ ఛానల్ లైవ్‌లో శుక్రవారం మాట్లాడారు. పార్లమెంటులో బీజేపీకి పూర్తిగా బలం లేదన్నారు. ఇప్పటికే శత్రఘ్నుసిన్హా, యశ్వంత్ సిన్హా వంటి వారు దూరమయ్యారని, వారు గ్రూపులు పెట్టుకున్నారని చెప్పారు. శివసేన వంటి పార్టీలి బీజేపీకి దూరమయ్యాయన్నారు.
చదవండి: వీరి తీరు ఘోరం, ఇందుకేనా: మోడీ-జైట్లీపై చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు

మోడీపై నమ్మకం పోయింది
రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత చాలామందికి ప్రధాని మోడీపై నమ్మకం పోయిందని ఉండవల్లి చెప్పారు. బీజేపీలో సీనియర్ల గ్రూపులు, శివసేన దూరం కావడం చూస్తుంటే బీజేపీకి పార్లమెంటులో బలం లేదని తేలిపోతుందన్నారు. ఏపీకి డిమాండ్లు సాధించుకునే క్రమంలో మరింత ఒత్తిడి తీసుకు రావాడానికి ఇదే సరైన సమయమని చెప్పారు.

బాబుకు ఛాన్స్, ఉపయోగించుకోవాలి
రాజస్థాన్‌లో రెండు సిట్టింగ్ ఎంపీ స్థానాలను బీజేపీ కోల్పోయిందని ఉండవల్లి గుర్తు చేశారు. బీజేపీ ముందస్తు ఎన్నికల ఆలోచనకు కూడా దూరమైందన్నారు. గతంలో ముందస్తుకు ఉత్సాహం చూపిందని, ఇప్పుడు అలాంటి ఆలోచన చేయడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు తన ముందు ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

కాంగ్రెస్ సరే, బీజేపీ ఏం చేసింది
చంద్రబాబు వెంటనే ఎన్డీయే భాగస్వామిగా తప్పుకొని, కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలతో రాజీనామా చేయించాలని ఉండవల్లి సూచించారు. నాడు రాష్ట్ర విభజన సమయంలో తప్పంతా కాంగ్రెస్‌దేని మోడీ చెబుతున్నారని, మరి ఈ మూడున్నరేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.

ఓటుకు నోటులో పెద్ద తప్పేం చేయలేదు
ఓటుకు నోటు కేసులో తనను అరెస్టు చేసి జైలులో పెడతారని చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారో తనకు అర్థం కావడం లేదని ఉండవల్లి పునరుద్ఘాటించారు. తన ఉద్దేశం ప్రకారం ఈ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లేంత పెద్ద తప్పేమీ చేయలేదన్నారు. ఒకవేళ కక్ష సాధింపు చర్యలు చేపట్టి జైలుకు పంపినా బాధపడాల్సిన పని లేదన్నారు.

బాబును జైలుకు పంపిస్తే జనం ఊరుకోరు
చంద్రబాబును జైలుకు పంపితే ప్రజలు చూస్తూ ఊరుకోరని ఉండవల్లి అన్నారు. ఆయనపై ఓట్ల రూపంలో తమ సానుభూతిని చూపిస్తారని తెలిపారు. జగన్ జైలుకు వెళ్లిన సమయంలో ఎన్నికలు జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేందని, ఈ విషయం గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడితే టీడీపీ మరింత మెజార్టీతో అధిక సీట్లు గెలుస్తుందన్నారు.

మోడీకి బలం లేదంటూ ఉండవల్లి చెప్పిన లెక్క
మోడీ ప్రభుత్వానికి లోకసభలో మెజార్టీ లేదంటూ ఉండవల్లి లెక్కలు చెప్పారు. రాజస్థాన్‌లో రెండు లోకసభ స్థానాలు పోగొట్టుకున్న బీజేపీకి 280 స్థానాలు ఉన్నాయని, యశ్వంత్, శత్రుఘ్ను సిన్హాల కూటమిలో ఎనిమిది మంది ఉన్నారని, మరికొంతమంది ఎదురు తిరిగే అవకాశముందని చెప్పారు. శివసేన దూరమైందని, అకాలీదళ్ అలాంటి పరిస్థితిలోనే ఉందని, టీడీపీకి కూడా ఉపసంహరించుకుంటే మోడీ వెంట నడుస్తున్న నితీష్ ఆలోచనలో పడతారని చెప్పారు.












Click it and Unblock the Notifications