సోము వీర్రాజు సవాల్ స్వీకరించిన ఉండవల్లి-టైం, ప్లేస్ చెప్పాలని డిమాండ్ ..!
ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతలైన రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ , బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు ఓ విషయంలో వివాదం తలెత్తింది. గత ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్బంగా ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సోము వీర్రాజుకు మంటపుట్టించాయి. దీంతో ఉండవల్లి అరుణ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సోము వీర్రాజు ఆయన్ను రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో చర్చకు రావాలని సవాల్ చేశారు. అయితే దీన్ని ఆలస్యంగా తెలుసుకున్న ఉండవల్లి సై అన్నారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆరెస్సెస్ నేపథ్యం ఉన్న ఎన్డీయే అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ కు ఓటు వేయొద్దంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఉండవల్లి ఆరెస్సెస్ పై చేసిన వ్యాఖ్యలు సోము వీర్రాజుకు మంటపుట్టించాయి. దీంతో ఆయన వెంటనే రంగంలోకి దిగి ఉండవల్లిని వాటిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. అయితే సోము వీర్రాజు సవాల్ గురించి ఉండవల్లికి వెంటనే తెలియలేదు. ఇవాళ దీని గురించి తెలుసుకున్న ఉండవల్లి చర్చకు తాను సిద్దమంటూ ప్రతిసవాల్ విసిరారు.

ఎమ్మెల్సీ సోము వీర్రాజు సవాల్ ను స్వీకరించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. టైం, ప్లేస్ చెబితే బహిరంగ చర్చకు వస్తానని ప్రకటించారు. రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానం, లేదా మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన తెలిపారు. మొదటి నుంచి బీజేపీలో ఉన్న సోము వీర్రాజుకు అన్ని విషయాలు కచ్చితంగా తెలుసని,కానీ తాను ఆర్ఎస్ఎస్ విధానాలను ఎందుకు వ్యతిరేకిస్తానో బహిరంగ చర్చలో చెబుతానని ఉండవల్లి తెలిపారు. ఈ బహిరంగ చర్చ ద్వారా ఆర్ఎస్ఎస్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.

గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు సీనియర్ రాజకీయ నాయకులు ఇలా ఆరెస్సెస్ పై చర్చకు సిద్దం కావడం చర్చనీయాంశమైంది. ఆరెస్సెస్ విషయంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి తప్ప మిగిలిన పార్టీలకు పెద్దగా అభ్యంతరాలు ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో సైతం తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలు ఆరెస్సెస్ నేపథ్యమున్న సీపీ రాధాకృష్ణన్ నే సమర్థించాయి. ఈ నేపథ్యంలో ఆరెస్సెస్ పై సోము, ఉండవల్లి చర్చ ఎటు దారితీస్తుందో అన్న వాదన కూడా వినిపిస్తోంది.
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications