వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్‌లా..:జైపాల్‌కు ఉండవల్లి సవాల్, టి బిల్లుపై అశోక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Undavalli Arun Kumar
రాజమండ్రి/హైదరాబాద్: సీమాంధ్ర నేతలు శుంఠలు అన్న కేంద్రమంత్రి జైపాల్ రెడ్డికి రాజమండ్రి కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆదివారం సవాల్ విసిరారు. తాను జైపాల్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. జైపాల్ రెడ్డి వంటి సీనియర్ నేత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్‌లా మాట్లాడటం విడ్డూరమన్నారు.

దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చర్చ అత్యంత హేయమైనదన్నారు. జైపాల్ రెడ్డి శుంఠలు అని వ్యాఖ్యానించడం దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు.

బర్తరఫ్ చేయాలి: యనమల

తెలుగు ప్రజలను అవమానించేలా మాట్లాడిన జైపాల్ రెడ్డిని పదవి నుండి బర్తరఫ్ చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వేరుగా అన్నారు. బోఫోర్స్ కుంభకోణంలో రాజీవ్ గాంధీని ఉరితీయాలన్న జైపాల్ రెడ్డి ఆ తర్వాత ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ భజనపరుడిగా మారారని ఎద్దేవా చేశారు. కెసిఆర్‌ను ఆదర్శంగా తీసుకొని జైపాల్ రెడ్డి అసభ్య పదాలు వాడుతున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్ర విభజన బిల్లు సీమాంధ్రకు మరణ శాసనమని ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు అన్నారు. అసెంబ్లీలో బిల్లును ఓడించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. ఈ నెల 17, 18న రాష్ట్ర బంద్, 20 ఛలో అసెంబ్లీ కార్యక్రమాల్లో మార్పు జరిగే అవకాశం ఉందనిచెప్పారు. బోగిరోజు ఒంగోలులో భారీ ఎత్తున టి బిల్లు దగ్ధం కార్యక్రమం ఉంటుందని చెప్పారు. సీమాంధ్రులను కించపర్చేలా మాట్లాడిన జైపాల్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, సీనియర్ రాజకీయవేత్తగా ఆయన హోదాకు తగవన్నారు.

English summary

 Congress party senior leader and Rajahmundry MP Undavalli Arun Kumar on Sunday challenged Union Minister Jaipal Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X