ఇంత నీచమా?: ఉండవల్లి, ప్రాణహాని: స్ప్రే‌పై లగడపాటి

Undavalli and Lagadapati fires at Congress
న్యూఢిల్లీ: రాజమండ్రి పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెసు పార్టీ పైన గురువారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీమాంధ్ర ప్రాంత ఎంపీలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లగడపాటి రాజగోపాల్‌ల పైన తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో దాడులు చేయించారని ఉండవల్లి ఆరోపించారు. లోకసభ ఘటన వివరాలు బయటకు రావాలంటే సెన్సార్ లేకుండా క్లిప్పింగులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పుడు నిజాలు తెలుస్తాయన్నారు.

ఇన్ని రాష్ట్రాలు విడిపోయినా ఎప్పుడైనా ఇలా జరిగిందా అన్నారు. చరిత్ర కలిగిన కాంగ్రెసు పార్టీ ఇంత దారుణంగా ఆలోచిస్తుందని తాను అనుకోలేదన్నారు. కాంగ్రెసు ఇంత నీచస్థాయికి దిగజారిందన్నారు. దాడుల నుండి తప్పించుకోవడానికే లగడపాటి పెప్పర్ స్ప్రే చేశారని వివరణ ఇచ్చారు. అయితే పెప్పర్ స్ప్రే లగడపాటి ఎలా తెచ్చారో తెలియదన్నారు. నేటి పరిస్థితి చూస్తుంటే విభజన జరిగితే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు.

పది ఎంపీ సీట్ల కోసం కాంగ్రెసు ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నారు. పలువురు ఎంపీలతో సీమాంధ్ర ఎంపీలతో దాడులు చేయించారన్నారు. సెన్సార్ లేకుండా వీడియోలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపే ముందు సిసి ఫుటేజి పరిశీలించాలన్నారు. సభ్యులకు కూర్చోబెట్టి నచ్చజెప్పే ప్రయత్నం చేయలేదన్నారు. లోకసభలోనే కొట్టుకుంటే పోలీసులు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. ఇది దేశానికి మంచి పరిణామం కాదన్నారు. సభలో ఎన్నడు లేని విధంగా దాడి జరిగిందన్నారు.

లగడపాటి ఆసక్తికర వ్యాఖ్యలు

లగడపాటి రాజగోపాల్ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిల్లు విషయంలో సొంత పార్టీ ఎంపీలతో కాంగ్రెసు పార్టీ మాట్లాడలేకపోయిందన్నారు. తనకు ప్రాణహానీ ఉందనే విశ్వసనీయ సమాచారముందని, అందుకే తన వద్ద ఎప్పుడు పెప్పర్ స్ప్రే ఉంటుందన్నారు. మోదుగులను కొడుతుంటే తాను అడ్డుకోబోయానని, తనను కూడా కొట్టబోతే ఆత్మరక్షణ కోసం పెప్పర్ స్ప్రే వాడానన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+