రిలయన్స్-గుజరాత్ : హోదా ఇవ్వకపోవడం వెనుక కొత్త అనుమానం
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వక పోవడం వెనుక ఓ కొత్త కోణం దాగి ఉందా? అంటే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కావొచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇది కేవలం తన అనుమానమేనని ఆయన అంటున్నారు.
చంద్రబాబు సంగతేంటి?: పవన్ కళ్యాణ్, కేటీఆర్‌కు ధీటైన కౌంటర్
ఏపీకి హోదా ఇవ్వకపోవడం వెనుక ఓ పెద్ద విషయం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విభజన నాడు నరేంద్ర మోడీ లేరని, ఇప్పుడాయనకు ఓ సమస్య ఉందని, రాష్ట్రానికి ఉన్న పెద్ద అసెట్ ఏమిటంటే.. కేజీ బేసిన్ అన్నారు.
కేజీ బేసిన్లో ఇంకా గ్యాస్ నిల్వలు, గుర్తించనివి చాలా ఉన్నాయని, వీటి విలువ వేల కోట్ల నుంచి లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుందని చెప్పారు. ఇండస్ట్రీ అంతా కూడా.. ఈ రిలయన్స్ అంతా కూడా గుజరాత్ తీరంలో ఉందని, ఇక్కడ గనుక ప్రత్యేక హోదా, నో ఎక్సైజ్ డ్యూటీ అంటే... వాళ్లంతా ఏపీకి వస్తారని అన్నారు.

ప్రధాని మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో పరిశ్రమలు మిగలవని, కాకినాడ, విశాఖ కలిసిపోతుందని, ఈ ఐదేళ్లలో టాక్స్ ఎగ్జంప్షన్‌తో ఓ 20 పర్సెంట్ లాభం పొందుతారని, రూ.కోటి పెడితే ఓ 20 లక్షలు ఉట్టినే లాభం వస్తుందన్నారు.
గుజరాతీ వాళ్లు పెద్ద వ్యాపారస్తులు కాబట్టి వారు ఆకర్షింపబడతారని, టక్ మని మొత్తం అందరూ ఏపీకి వస్తారని, అందుకనే ప్రత్యేక హోదా ఆపేశారా అని తన వ్యక్తిగత అనుమానమని అన్నారు. తాను పెట్రోలియం కంపెనీ చైర్మన్‌గా పని చేశాను కాబట్టి, ఇక్కడున్న నిల్వల విలువ తెలుసునని, ఇదే మనకు పెద్ద అసెట్ అన్నారు. రేపు రాబోయే రోజుల్లో వీటిని సరిగ్గా వాడుకోగలిగితే ఏపీకి తిరుగు ఉండదని, ఈ అమరావతి, రాజధానిని కట్టక్కర్లేదన్నారు.
పవన్ పోరాటం స్వాగతిస్తున్నాం: రాఘవులు
ప్రత్యేక హోదా పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాటాన్ని స్వాగతిస్తున్నామని సిపిఎం నేత రాఘవులు అన్నారు. అయితే పవన్ మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలన్నారు. విశాఖకు రైల్వే జోన్ వస్తుందని బిజెపి నేత కావూరి సాంబశివ రావు అన్నారు. ఇందుకోసం కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications