ఏపీ సమస్యలపై రేపు ఢిల్లీలో కీలక భేటీ-కేంద్ర కేబినెట్ సచివాలయ సమీక్ష-ఇదే తొలిసారి !
2014లో ఏపీ విభజన జరిగి ఎనిమిదేళ్లు పూర్తయిపోయాయి. అయినా ఇప్పటికీ విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. దీనిపై ఈ ఎనిమిదేళ్లలో ఏపీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, జగన్ ఇద్దరూ కలిసి కనీసం 50 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రయత్నాలు చేశారు. అయినా ఇప్పటికీ అడుగు ముందుకు పడటం లేదు. ఈ నేపథ్యంలో రేపు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఓ కీలక భేటీ నిర్వహిస్తోంది.
ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాలపై రేపు ఢిల్లీలో కీలక సమావేశం జరగబోతోంది. కేంద్ర కేబినెట్ సచివాలయం ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. కేంద్ర, రాష్ట్రాల సమన్వయ కార్యదర్శి నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి హాజరుకావాలని ఏపీకి సమాచారం పంపారు. దీంతో అధికారులు బయలుదేరి వెళ్తున్నారు. ఏపీకి సంబంధించిన పెండింగ్ అంశాల జాబితా పంపాలని గతంలోనే కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈనెల మొదటి వారంలోనే అందించాలని ఏపీని కేబినెట్ సెక్రటేరియట్ ఆదేశించింది.

కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల వద్ద ఏపీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాల జాబితాను కేబినెట్ సెక్రటేరియట్ కోరింది. కేంద్రం గతంలో ఇచ్చిన హామీలు, నెరవేర్చినవి, పెండింగ్‍లో ఉన్న వాటిపై కేబినెట్ సెక్రటేరియట్ తొలిసారి సమీక్ష జరపబోతోంది. ఈ భేటీ అజెండాలో వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన మొత్తం 34 పెండింగ్ అంశాలు ఉన్నాయి. అయితే 2016 సెప్టెంబర్ వరకే పెండింగ్ జాబితా తమ వద్ద ఉందని కేబినెట్ సెక్రటేరియట్ తెలిపింది.
ఆ తర్వాత నుంచి పెండింగ్ లో ఉన్న అంశాల వివరాలు కేంద్రం వద్ద లేనట్లు తెలుస్తోంది. దీంతో తాజా వివరాలు పంపాలని ఏపీని కోరారు. అయితే 2019 నుంచి ఒక్క పెండింగ్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నివేదించేదని తెలుస్తోంది. పెండింగ్ అంశాల జాబితా అప్‍డేట్ చేయాలని ఇప్పటికే రాష్ట్రానికి లేఖ రాసినా ప్రత్యేక హోదా, రైల్వేజోన్ వంటి అంశాలపై అప్‍డేట్ చేయలేదని కేబినెట్ సెక్రటేరియట్ అధికారులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈనెల 8లోపు అన్ని విషయాలు ఈ సమీక్షలో అప్‍డేట్ చేయాలని అక్టోబర్ 31న రాష్ట్ర సీఎస్‍కు కేబినెట్ సెక్రటేరియట్ డైరెక్టర్ లేఖ రాశారు. అయితే ఈ వివరాలు పంపారో లేదో తెలియదు. రేపు భేటీలో వాస్తవంగా పెండింగ్ లో ఉన్న అన్ని అంశాలపై చర్చిస్తారు.
-
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
LPG పై కేంద్రం మరో గుడ్ న్యూస్ -రాష్ట్రాలకు లేఖలు..! -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
Fuel Stock: భారత్ లో చమురు స్టాక్ ఇదే..! తేల్చేసిన కేంద్ర ప్రభుత్వం..! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్‍డేట్..!












Click it and Unblock the Notifications