ఏపీకి భారీ ఊరట: కేంద్రం నుంచి రెవెన్యూ లోటు భర్తీకి రూ. 1438 నిధులు విడుదల

న్యూఢిల్లీ: రెవెన్యూ లోటుతో నెట్టుకొస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం భారీ ఊరట కల్పించింది. తాజాగా, ఏపీతోపాటు రెవెన్యూ లోటు ఉన్న 17 రాష్ట్రాలకు నిధులను విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా రూ. 9,871 కోట్ల లను రిలీజ్ చేసింది కేంద్ర ఆర్ధిక శాఖ.

ఆంధ్రపదేశ్‌ రాష్ట్రానికి కేంద్రం రూ. 1438 కోట్లను రిలీజ్ చేసింది. విభజన తర్వాత రెవెన్యూ లోటు లోకి వెళ్లిన ఆంధ్రపదేశ్ కు కరోనా కూడా తోడవ్వడంతో తీవ్ర ఆర్ధిక కష్టాలను ఎదుర్కొంటుంది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.1,438 కోట్లు రిలీజ్ చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరటనిచ్చే విషయమే.

 union finance ministry released revenue deficit grant to 17 states: Rs. 1438 Cr to Andhra Pradesh

కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరానిని ఏపీకి మొత్తంగా ఇప్పటి వరకు రూ.8,628.50 కోట్లను విడుదల చేశామని కేంద్రం ఆర్థిక శాఖ తెలిపింది. కేంద్ర విడుదల చేసిన ఆర్థిక సహాయం పై ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ స్పందించారు. 2021- 22 ఆర్ధిక సంవత్సరానికి 15 వ ఆర్థిక సంఘం మొదటి విడతగా రూ.581.70 కోట్లను కేంద్రం విడుదల చేసిందని చెప్పారు. ఈ నిధుల్లో 70% అంటే రూ. 407.19 కోట్లు గ్రామ పంచాయతీలకు, 15% అంటే రూ.174.51 కోట్లు జిల్లా పరిషత్‌లకు 15% అంటే రూ.174.51 కోట్లు మండల పరిషత్ లకు జమ అయ్యిందని వెల్లడించారు.

లోటు ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ నిధులు కేటాయిస్తున్న విషయం తెలిసిందే. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు లోటు భర్తీకి నిధులు విడుదల చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్ర పన్నుల వాటా కాకుండా అదనంగా 2021 -22లో రూ.17,257 కోట్లు ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ఈ మేరకు ఇప్పటికే రూ.8,628.50 రిలీజ్ చేసింది. ప్రస్తుతం కేంద్రం లోటు భర్తీ నిధులు విడుదల చేయడంతో ఏపీ ప్రభుత్వానికి కొంత రిలీఫ్ ఇచ్చినట్లయ్యింది.

కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు సంబంధిత అధికారులను కలిశారు. ఈ క్రమంలో ఏపీ రుణ పరిమితిని పెంచుకోవడంలో ఆయన సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఈ కారుణంగా రూ. 10,500 కోట్లు డిసెంబర్ వరకూ అదనపు రుణం తీసుకోవడానికి అవకాశం లభించిందని తెలుస్తోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వ‌ర‌కు అర్హత కలిగిన రాష్ట్రాలకు "పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్" గ్రాంట్ కింద రూ. 59,226 కోట్లు విడుదలైనట్టయ్యింది.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు పీడీఆర్‌డీ రెవెన్యూ లోటు గ్రాంట్‌ను కేంద్రం ఇవ్వాల్సి ఉంది.. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం 17 రాష్ట్రాలకు రెవిన్యూ లోటు నిధులను సిఫార్సు చేసింది ఆర్థిక సంఘం..

Recommended Video

    Women Will Now Be Allowed To Join NDA, Centre Informs Supreme Court || Oneindia Telugu

    కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 17 రాష్ట్రాలకు రూ.1,18,452 కోట్లు ఇవ్వాల్సి ఉండ‌గా, ఇందులో రూ. 59,226 కోట్లు అంటే ఇప్పటి వరకు 50 శాతం నిధులు విడుదల చేసింది.. ఆర్థికసంఘం సిఫార్సు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అసోం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+