ఏపీలో 31హైవేల నిర్మాణానికి కేంద్రమంత్రి గడ్కరీ శంకుస్థాపన; బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ 2 ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రహదారులకు మహర్దశ వచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోని 31 జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తో కలిసి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

బెజవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ 2 ను ప్రారంభించిన నితిన్ గడ్కరీ
ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఏపీకి చేరుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డిలకు గన్నవరం విమానాశ్రయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ బాలశౌరి స్వాగతం పలికారు. ఇక బీజేపీ తరఫున ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, సిఎం రమేష్ ,ఎమ్మెల్సీ మాధవ్ లు స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి సీఎం జగన్ తో పాటు సభా ప్రాంగణానికి చేరుకుని, అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఆపై మొదటగా బెజవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ 2 ను ప్రారంభించారు.

ఏపీలో 51 ప్రాజెక్టులకు ఈరోజుతో ముందడుగు పడుతోందన్న సీఎం జగన్
ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో 51 ప్రాజెక్టులకు ఈరోజుతో ముందడుగు పడుతోందని ఆయన పేర్కొన్నారు. పది వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో రహదారుల పనులకు శంకుస్థాపన చేశామని సీఎం జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియం లో జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రహదారులు ఇతర ప్రాజెక్టులను ప్రారంభించిన నితిన్ గడ్కరీ ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు .

దేశంలో రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదు: నితిన్ గడ్కరీ
రహదారుల అభివృద్ధి చెందితే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని వాజ్ పేయి నమ్మారని పేర్కొన్నారు. వాజ్పేయి హయాంలోనే స్వర్ణ చతుర్భుజి నిర్మాణం జరిగిందని, కేంద్రం నిర్వహిస్తున్న గ్రామ సడక్ యోజన ఇప్పుడు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో పోర్టుల అభివృద్ధికి రహదారుల నిర్మాణం కూడా చాలా ముఖ్యమని పేర్కొన్న నితిన్ గడ్కరీ దేశంలో రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదని, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేలు నిర్మాణం జరగాల్సి ఉందని ఆయన వెల్లడించారు.

పోలవరం పూర్తయ్యాక వస్తానన్న నితిన్ గడ్కరీ
ఇదే సమయంలో రోడ్లు బాగుంటేనే రవాణా వ్యయం భారీగా తగ్గుతుందని పేర్కొన్న ఆయన చైనాతో పోలిస్తే భారత దేశంలో రవాణా వ్యయం ఎక్కువగా ఉందని వెల్లడించారు. వ్యవసాయ రంగంలో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. పోలవరం పూర్తి అయిన తరువాత వ్యక్తిగతంగా వస్తానని మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. జలవనరుల మంత్రిని కాకపోయినా పోలవరం చూస్తానని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఏపీలో 3 లక్షల కోట్ల విలువైన రోడ్లు నిర్మిస్తామని, ఏపీలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేలను కేంద్రం నిర్మిస్తోందని పేర్కొన్నారు. 2024 నాటికి రాయపూర్ విశాఖ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications