చట్టబద్ధతపై వైసిపి ఎంపీ ప్రశ్న: ఏపీ నోటిఫై చేశాక.. ప్యాకేజీపై కేంద్రం శుభవార్త

ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించామన్నారు. ప్యాకేజీ నోటిఫై చేసిన వెంటనే అమలులోకి వస్తుందని చెప్పారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రమంత్రి ఇంద్రజిత్ సింగ్ శుభవార్త చెప్పారు. ఏపీకి ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ పైన చట్టబద్ధత కల్పించామని ఆయన తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డి బుధవారం సభలో ప్యాకేజీ పైన ప్రశ్నించారు.

ప్రత్యేక ప్యాకేజీ అంశం ఎంత వరకు వచ్చిందని ఆయన అడిగారు. దీనిపై కేంద్రమంత్రి ఇంద్రజిత్ స్పందించారు. ఆయన లిఖిత పూర్వకంగా సమాదానం ఇచ్చారు.

special package

ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించామన్నారు. ప్యాకేజీ నోటిఫై చేసిన వెంటనే అమలులోకి వస్తుందని చెప్పారు. వెనుకబడిన జిల్లాలను ఏపీ నోటిఫై చేసిన తర్వాత అందుకు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అన్నింటిని తాము ప్యాకేజీలో పొందుపర్చామని చెప్పారు. ఇచ్చిన హామీలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. రాజధాని అమరావతికి కూడా నిధులు ఇచ్చామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+